భారతీయ రైల్వే మరో కొత్త నిర్ణయం... తత్కాల్ టికెట్ల కష్టాలకు చెక్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన..!
Indian Railways Tatkal Tickets : భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైల్వే మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తోంది. మరియు హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల కొంత కాలంగా టికెట్ల బుకింగ్ లోనూ కీలక మార్పులను తీసుకొస్తోంది. అయితే ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
రైల్వేలో 60 రోజుల ముందుగానే స్లీపర్, AC టికెట్లను బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే తాత్కాల్ టికెట్లను మాత్రం ప్రయాణానికి ఒక రోజు ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. వేర్వేరు సమయాల్లో స్లీపర్, AC బోగీల్లో టికెట్ల కోసం తత్కాల్ కోటాలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ వ్యవహారంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తత్కాల్ బుకింగ్ సమయంలో సామాన్యులకు కాకుండా ఏజెంట్లకు మాత్రమే టికెట్లు లభిస్తున్నాయని, ఫలితంగా అవసరం అయిన వారికి టికెట్లు అందడం లేదంటూ కొన్నిరోజులు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కీలక నిర్ణయం :
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఇ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రక్రియను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందో వెల్లడి కాలేదు.
వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే :
తత్కాల్ కోటా టికెట్ల కోసం ఇ-ఆధార్ వెరిఫికేషన్ లో భాగంగా ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసి, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తేనే, టికెట్ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఈ విధానం ద్వారా అవసరం అయిన వారికి మాత్రమే టికెట్లు లభించే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
ఇప్పటి వరకు ఆధార్ వెరిఫికేషన్ కోసం IRCTC థర్డ్‌పార్టీలపై ఆధారపడింది. అయితే ఇప్పటి నుంచి రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం ద్వారా ప్రయాణికుల ఆధార్ వెరిఫికేషన్ చేయనున్నారు. దీంతోపాటు IRCTC వెబ్‌సైట్‌కు 13 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే వారిలో కేవలం 1.2 కోట్ల మంది మాత్రమే ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది.
మిగిలిన ఖాతాలకు ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేయాలని భావిస్తోంది. వారికే తత్కాల్ బుకింగ్‌కు అనుమతించాలని భావిస్తోంది. ఇప్పటికే 3.5 కోట్ల తప్పుడు ఐడీలను బ్లాక్ చేసినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. అత్యవసర సమయాల్లో టెకెట్ల బుకింగ్ కోసం ప్రయత్నం చేసే వారికి రైల్వే తాజా నిర్ణయం మేలు చేసే అవకాశం ఉంది.
ఇటీవలే మరో నిర్ణయం :
ఇటీవలే రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ప్రయాణికులు స్లీపర్, AC బోగీల్లో ప్రయాణించకుండా నిబంధనలు తీసుకొచ్చింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు కేవలం జనరల్ బోగీల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు. మరియు తర్వాత స్టేషన్‌లోనే జనరల్ బోగీల్లోకి మారాల్సి ఉంటుంది. దీంతోపాటు రైల్వే ప్రయాణికుల కోసం సూపర్ యాప్‌ను లాంచ్ చేసింది. స్వరైల్ పేరుతో ఈ యాప్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికే బీటా వెర్షన్‌లోనే అందుబాటులో ఉంది.
స్వరైల్ యాప్ ద్వారా టికెట్లు బుకింగ్, ప్లాట్‌ఫాం టికెట్లు, ఫిర్యాదులు, ట్రైయిన్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ వంటి అన్ని ఫీచర్లను ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఈ యాప్ ఇంటర్‌ఫేస్ కూడా చాలా సౌకర్యంగా ఉంది. IRCTC రైల్ కనెక్ట్ యాప్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా ఈ కొత్త యాప్‌లో లాగిన్ కావచ్చు.


Click it and Unblock the Notifications