ప్రయాణికులకు శుభవార్త, రైళ్లలో 4 లక్షల అదనపు బెర్తులు

By Gizbot Bureau
|

రైళ్లల్లో ప్రయాణించేవారికి శుభవార్త. అక్టోబర్ నుంచి రోజుకు అదనంగా 4 లక్షలకు పైగా బెర్తులు అందుబాటులోకి రానున్నాయి. టెక్నాలజీ సాయంతో భారీగా బెర్తుల్ని ప్రయాణికులకు భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది.

Indian Railways to offer additional 4 lakh seats per day

గ్రీన్ టెక్నాలజీ సాయంతో అక్టోబర్ నుంచి రైళ్లలో అదనంగా నాలుగు లక్షల బెర్తులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకూ రైళ్లలో ఎసిలు పనిచేయడానికి పవర్ కార్లు వినియోగిస్తున్నారు. అయితే త్వరలో అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం తో వీటి అవసరం ఉండదు.

గ్రీన్ టెక్నాలజీ

గ్రీన్ టెక్నాలజీ

ప్రతి రైలుకు ఒకటి లేదా రెండు పవర్ కార్స్ చివరి భాగంలో అమరి ఉంటా యి. వీటిలోని డీజిల్ జనరేటర్ల ద్వారా రైల మొత్తాని కి అవసరం అయిన విద్యుత్ సరఫరా జరుగుతుంది. దీనిని ఎండ్ ఆన్ జనరేషన్‌గా (ఇఒజి)గా పిలుస్తారు. అయితే గ్రీన్ టెక్నాలజీలో భాగంగా దీని స్థానంలో హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్‌ఒజి) ప్రక్రియ అమలులో కి వస్తుంది. ఈ ప్రక్రియలో ఓవర్ హెడ్ పవర్ లైన్స్ ద్వారా విద్యుత్ సేకరణ జరిగి, అది రైలులోని ఎసి, లైట్లు ఇతర ఏర్పాట్లకు ఉపయోగపడుతుంది.

పాంటోగ్రాఫ్ అనే పరికరం ద్వారా

పాంటోగ్రాఫ్ అనే పరికరం ద్వారా

ప్రస్తుతం పాంటోగ్రాఫ్ అనే పరికరం ద్వారా ఓవర్ హెడ్ టెన్షన్ వైర్లద్వారా గ్రహించే విద్యుత్‌ను కేవలం ఇంజిన్లకు వాడుతున్నారు.దీనితో రైలు ఇంజిన్ నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి అమలులో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 5వేల రైళ్లలో ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

5 వేల కోచ్‌లకు పైగా

5 వేల కోచ్‌లకు పైగా

అక్టోబర్ నాటికి భారతీయ రైళ్లలో 5 వేల కోచ్‌లకు పైగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నా యి. దీనితో ఇంజిన్ల ద్వారా అందే విద్యుత్‌ను ఈ కోచ్‌లు ఈ కొత్త పద్ధతిలో వినియోగించుకుంటాయి. ఈ ఏర్పాటు వల్ల అదనపు బోగీలను ఏర్పాటు చేసేందుకు వీలేర్పడుతుంది. అంతేకాకుండా ఇంధన బిల్లు ల రూపంలో రైల్వేకి ఏటా రూ 6 వేల కోట్ల బిల్లులు రూపంలో ఆదా అవుతుందని, దీనిని అదనపు బెర్త్‌ల ఏర్పాటుకు వెచ్చిస్తారని వెల్లడించారు.

 పర్యావరణానికి మేలు

పర్యావరణానికి మేలు

నూతన సాంకేతికతతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. కర్బన ఉద్గారాల తగ్గింపునకు వీలేర్పడుతుంది. కొత్తవ్యవస్థతో ఇకముందు ప్రతి రైలుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఒకే ఒక్క పవర్ కారును అమరుస్తారు. తొలిగించిన పవర్ కారు స్థానంలో ఇప్పుడు ఉండే రైలు పొడవు పెంచాల్సిన అవసరం లేకుండానే ఒక కోచ్‌ను ఏర్పాటు చేయడం వల్ల కొత్త గా రోజుకు 4 లక్షల బెర్తులు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారి తెలిపారు.

పర్యావరణ హితంగా

పర్యావరణ హితంగా

ప్రస్తుతమున్న పవర్ కార్స్‌కు ప్రతి గంటకు నాన్ ఎసి కోచ్‌లకు 40 లీటర్ల డీజిల్, ఎసి కోచ్‌లకు గంటకు 65 70 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. దీనితో అవసరం అయిన విద్యుత్‌ను రూపొందిస్తారు. ఒక్క లీటరు డీజిల్‌తో దాదాపు 3 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలవుతుంది. అయితే ఎసి కోచ్‌లలో గంటకు 120 యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. పర్యావరణ హితంగా ఉండే వినూత్న పద్ధతిలో శబ్ధ కాలుష్యం ఉండదు. ఏడాదికి 700 ఎంటి మేర కర్బన్ ఉద్గారాల తగ్గింపు జరుగుతుంది.

Best Mobiles in India

English summary
Indian Railways to offer additional 4 lakh seats per day, thanks to new technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X