పైరసీ వెబ్‌సైట్‌లలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారా.. అయితే మీరు పెద్ద డేంజర్‌లో ఉన్నట్టే..!!
సినిమాలు, వెబ్ సిరీస్ ఇతర టీవీ షోలను చూసేందుకు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ తీసుకోకుండా పైరసీ వెబ్‌సైట్‌లపై ఆధారపడుతున్నారా అయితే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నిర్వహించిన సంచలన నివేదికను వెల్లడించింది. 'ద పైరసీ మాల్‌వేర్ నెక్సస్ ఇన్ ఇండియా' పేరుతో ఈ రిపోర్టును విడుదల చేసింది. అలయన్స్ ఫర్ క్రియేటివిటి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్‌తో కలిసి ISB ఈ అధ్యయనం చేసింది.
ఈ నివేదిక కీలక ఆధారంగా అడల్ట్ సైట్లు, గ్యాంబ్లింగ్ యాడ్స్‌తో పోల్చితే పైరసీ వెబ్‌సైట్లతోనే (Piracy Websites) ఎక్కువ మాల్‌వేర్ ప్రమాదం ఉందని ఈ రిపోర్టు వెల్లడించింది. పైరసీ సైట్లలో మాల్‌వేర్ అటాక్ జరిగే అవకాశం 59 శాతంగా ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అదే అడల్ట్ సైట్లలో 57 శాతం, గ్యాంబ్లింగ్ యాడ్స్ సైట్లలో 53 శాతం మాల్‌వేర్ అటాక్‌ల ప్రమాదం ఉంటుందని వెల్లడైంది.

ఈ అధ్యయనం గత సంవత్సరం మే 23 నుంచి మే 29 వరకు చేసినట్లు తెలుస్తోంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సుమారు 1037 మందిని సర్వే చేసినట్లు తెలిపింది. ఈ పైరసీ వెబ్‌సైట్లను చూసే వారిలో ఎక్కువగా 18-24 సంవత్సరాల యువకులు ఎక్కువగా ఉంటున్నారు. వారికి పైరసీ కారణంగా ఏర్పడే ప్రమాదంపై సరైన అవగాహన లేదని ఈ నివేదిక వెల్లడించింది.
సినిమాలు, ఇతర వెబ్‌సిరీస్, టీవీ షోల కోసం పైరసీ వెబ్‌సైట్లపైన ఆధారపడే వారి మొబైల్‌లోకి మాల్‌వేర్ పంపడం ద్వారా ఆయా స్మార్ట్‌ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉన్నట్లు ఈ నివేదిక హెచ్చరించింది. అయితే కొంచెం పేరున్న పైరసీ సైట్ల కంటే స్కామ్‌లకు సంబంధించిన పైరసీ సైట్లతో ఎక్కువ ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.
భారత్‌లో ప్రధానంలో పైరసీ వెబ్‌సైట్లు.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని నష్టాలకు గురిచేస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2022 సంవత్సరంలో సినిమా నిర్మాతలు, నటులు సహా ఇతరులకు పైరసీ కారణంగా రూ.25,500 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు తెలిపింది. అయితే ఆన్‌లైన్ పైరసీ చేసే వారు భారీగా లాభాలు పొందుతున్నట్లు తెలిపింది. ఈ పైరసీ వెబ్‌సైట్లలో మాల్‌వేర్‌లతో అదనపు ఆదాయం వస్తున్నట్లు తెలిపింది.
ఈ పైరసీ సైట్లను వినియోగిస్తున్న ఎక్కువ మందికి ఇటువంటి మాల్‌వేర్ అటాక్‌లపై అవగాహన తక్కువగా ఉంటోందని ఈ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సైట్ల వినియోగం వల్ల కలిగి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ప్రొఫెసర్ మనిష్ గంగ్వార్ తెలిపారు.
దీంతోపాటు డిజిటల్ కాపిరైట్ నేరాలు కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రిసెర్చ్ సిఫార్సు చేసింది. మరియు ఈ సిండికేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సినిమాలు, ఇతర వెబ్‌సిరీస్‌ల కోసం ఇటువంటి పైరసీ వెబ్‌సైట్లపై ఆధారపడేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








