పాము తరహా రోబోలు... సహాయక చర్యల్లో కీలకం!

Posted By:

పాము తరహా రోబోలు... సహాయక చర్యల్లో కీలకం!
అత్యవసర సమయాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు భారతీయ శాస్త్రవేత్తలు బృందం పాము తరహా రోబోట్‌లను వృద్ధి చేసింది. వీటి పనితీరును పరీక్షించేందుకు తొలిగా మిలటిరీ అవసరాలకు వినియోగించనున్నారు. ఈ ‘స్నేక్ రోబోట్'ను డిఫెన్స్ రెసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, సెంటర్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (సీఏఐఆర్)లు సంయుక్తంగా వృద్ధిచేసాయి.

రోబోట్ పొడవు 1.5మీటర్లు ఉంటుంది. హైడెఫినిషన్ కెమెరాలతో పాటు అల్ట్రాసోనిక్ సెన్సార్‌లను రోబోలో ఫిక్స్ల్ చేశారు. ఇరుకు ప్రాంతాల్లోకి సైతం ఈ రోబోలు చొచ్చుకుపోగలవు. విపత్తు పరిసర ప్రాంతానికి సంబంధించి సమాచారాన్ని ఫోటోల రూపంలో ఈ రోబోలు చేరవేస్తాయి. తద్వారా సహాయక చర్యలను మరింత ప్రణాళికలతో అమలు చేయవచ్చని సీఏఐఆర్ శాస్త్రవేత్త సర్తాజ్ సింగ్ తెలిపారు. ఈ రోబోలను దేశవ్యాప్తంగా నిర్వహించిన పలు సైన్స్ ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించారు.

రోబో రెస్టారెంట్‌

చైనాలోని హార్బిన్ పట్టణంలో ఇటీవల ఓ రోబో రెస్టారెంట్ వెలిసింది. అవును.. మీరు అనుకుంటున్నట్లుగానే ఇక్కడ రోబోలు పనిచేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18. మనం ఇలా రెస్టారెంట్లోకి అడుగుపెట్టగానే.. అక్కడ ఉన్న రోబో ఘన స్వాగతం పలుకుతూ వెల్‌కం చెబుతుంది. సీట్లలో కూర్చున్నవెంటనే మరో రోబో వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది. కొంతసేపట్లోనే వేరొక రోబో వచ్చి.. మీరు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సర్వ్ చేసి వెళ్లిపోతుంది. అంతే కాదండోయ్.. మీరు తింటున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓ రోబో సింగర్ వచ్చి పాటలు కూడా పాడేస్తుంది.

చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడో రోబో కుక్క కూడా ఉంది. తినడం అయిపోగానే.. కిచెన్‌లో ఉండే రోబో మీ ప్లేట్లను ఎంచక్కా కడిగేస్తుంది కూడా. అంతేకాదు.. మిగతా హోటల్లో ఇచ్చినట్లు ఇక్కడ రోబోలకు టిప్ ఇవ్వనక్కర్లేదు. ఈ రోబో రెస్టారెంట్‌ను ‘భవిష్యత్ రెస్టారెంట్'గా అభివర్ణిస్తున్నారు. ఈ హోటల్ కంప్యూటర్ రూంలో సిబ్బంది ఈ రోబోల కదలికలను నియంత్రిస్తుంటారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot