Home
News

ఆ జాబితాలో ఐఫోన్‌ 16 టాప్‌.. వాల్యూమ్‌ పరంగా వివో టాప్‌.. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌ కీలక నివేదిక..!

Indian Smartphone Market : భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ వృద్ధిపై టెక్నాలజీ మార్కెట్‌ రీసెర్ట్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ ( Counterpoint ) తన నెలవారీ నివేదికను వెల్లడించింది. ఈ సంవత్సరం తొలి ట్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో వృద్ధి నమోదైనట్లు తెలిపింది. సంఖ్యా పరంగా 8 శాతం వృద్ధిని నమోదుచేసినట్లు తెలిపింది. మొత్తంగా విలువ పరంగా 8 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కౌంటర్‌పాయింట్‌ తన నివేదికలో పేర్కొంది.

ఈ జాబితాలో ఐఫోన్ 16.. వాల్యుమ్‌ పరంగా వివో ..!
ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా సరఫరా అయిన మొబైల్‌ గా ఐఫోన్ 16 నిలిచిందని తెలిపింది. అయితే మొత్తం వాల్యూమ్‌ పరంగా వివో తొలి స్థానంలో నిలిచినట్లు తెలిపింది. విలువ పరంగా శాంసంగ్, ఆపిల్‌ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది.

indian smartphone market grows by 8 percent

20 శాతంతో వివో :
వాల్యుమ్‌ పరంగా వివో 20 శాతంతో తొలి స్థానంలో ఉండగా.. శాంసంగ్ 16 శాతం, ఒప్పో 13 శాతం, రియల్‌మి 10 శాతం, షియోమీ 8 శాతం వాటాను కలిగి ఉన్నట్లు కౌంటర్‌పాయింట్ తన నివేదికలో వెల్లడించింది. టోకు విలువ పరంగా శాంసంగ్‌, ఆపిల్‌ 23 శాతం చొప్పున కలిగి ఉన్నాయి.

అనేక అంశాలు కలిసివచ్చాయి :
వివో 15 శాతం, ఒప్పో 10 శాతం, రియల్‌మి 6 శాతం, వన్‌ప్లస్‌ 4 శాతంగా ఉన్నాయి. గతంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ దూకుడుకు కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌లు, సమ్మర్‌ సేల్స్‌, భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు, మార్కెటింగ్, బ్రాండ్ల వారీగా డిస్కౌంట్‌ లు, సులభతరమైన EMI ఆప్షన్‌ లు కారణమని కౌంటర్‌పాయింట్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ప్రచీర్ సింగ్ తెలిపారు.

వినియోగదారుల విశ్వాసాం :
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ తిరిగి పుంజుకొనేందుకు స్థూల ఆర్థిక వాతావరణం కలిగి వచ్చిందని తెలిపారు. వినియోగదారుల విశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి తగ్గడం కారణంగా అనేక కుటుంబాలపై ఒత్తడి తగ్గిందని తెలిపారు.

అనుకూల వాతావరణం :
దీంతోపాటు రెపో రేటు తగ్గడం, ఈ సంవత్సరంలో పన్ను ఉపశమన చర్యలు.. ఆదాయం, పొదుపును పెంచాయని ఇవన్నీ అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని తెలిపారు. మరియు అల్ట్రా ప్రీమియం (రూ.45 వేలు కంటే ఎక్కువ) విభాగం 37 శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు.

అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌ :
ఫలితంగా భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ రెండో త్రైమాసికంలో విలువ, విక్రయాల పరంగా రికార్డు స్థాయి పనితీరు కనబరిచేందుకు అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌ సహాయపడింది. ఈ సెగ్మెంట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ధరల శ్రేణిగా మారిందని తెలిపారు.

మొత్తంగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో మెరుగైన రికవరీని నమోదు చేసింది. వాల్యూమ్‌ పరంగా వివో తొలి స్థానంలో నిలవగా.. విలువ పరంగా శాంసంగ్‌, ఆపిల్‌ తొలి స్థానంలో ఉన్నాయి. మొత్తంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పుంజుకొనేందుకు అనేక అంశాలు కలిసి వచ్చాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
indian smartphone market grows by 8 percent, iphone 16,vivo are in the top, counterpoint research
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X