X (ట్విట్టర్)కు పోటీనిచ్చిన ఇండియన్ సోషల్ మీడియా యాప్ Koo మూసివేత... కీలక ప్రకటన చేసిన వ్యవస్థాపకులు..!!
దేశీయ సోషల్ మీడియా స్టార్టప్ కూ యాప్ (Koo App) తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. సంస్థ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా దీనిపై ప్రకటన చేశారు. ఈ యాప్ 2020 లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ట్విట్టర్ కు పోటీగా మారుతుందని భావించిన యాప్.. ఏకంగా మూసివేసే స్థితికి పడిపోయింది. అనేక సంస్థలు, మీడియో హౌస్ లతో చర్చలు విఫలమైన అనంతరం కూ వ్యవస్థాపకులు తమ లింక్డిన్ లో ఈ మేరకు ప్రకటన చేశారు.
భారత్ లో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇస్తూ క్రమంగా కూ యాప్ (Koo App Shutdown) ఎదిగింది. ఒకానొక సమయంలో X (ట్విట్టర్) కు గట్టి పోటీనిచ్చే విధంగా రోజువారీ యూజర్లను సంపాదించింది. ఈ కూ యాప్ గరిష్టంగా 21 లక్షల రోజువారీ యూజర్లను సంపాదించుకుంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా సహకారం అందించింది.

కేంద్ర ప్రభుత్వానికి, X (ట్విట్టర్) మధ్య ఘర్షణ సమయంలో కూ యాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అనంతరం నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు సర్వీసులు అందించింది. అయితే తర్వాత క్రమంగా కూ యాప్ ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఆర్థిక కష్టాలతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదని స్థితికి చేరుకుంది. ఈ సంవత్సరం లేఆఫ్‌లు కూడా ప్రకటన చేసింది.
అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అనేక సంస్థలతో చర్చలు జరిపింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న న్యూస్ అగ్రిగ్రేటర్ డైలీ హంట్‌తోనూ చర్చలు జరిగాయి. అయితే చర్చలు విఫలం కావడంతో మరో అవకాశం లేక మూసివేస్తున్నట్లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా ప్రకటన చేశారు.
ఈ మేరకు లింక్డిన్ లో నోట్ పెట్టారు. దేశీయ సోషల్ మీడియా యాప్ కూ ను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేసినా.. ఏవీ ఫలితాలు ఇవ్వలేదని చెప్పారు. నిధుల కొరత తమకు ప్రధాన అవరోధంగా మారిందని తెలిపారు. ఎక్కువ కాలంపాటు ఆర్థిక సాయం కావాలని.. అప్పుడు మాత్రమే లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతోపాటు ఈ యాప్ నిర్వహణ భారం కూడా అధికంగా ఉందని తెలుస్తోంది.
X (ట్విట్టర్) పోటీగా బలంగా ఎదుగుతుందనుకున్న కూ యాప్ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే తన సర్వీసులను నిలిపివేసింది. స్థానిక భాషల్లో సర్వీసులకు అవకాశం ఇచ్చిన యాప్ వేగంగా మూతబడింది. ఒకానొక సమయంలో ప్రభుత్వం, నాటి కేంద్ర మంత్రులు కూడా ఈ యాప్ ను భారీగా ప్రమోట్ చేశారు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








