ISRO SpaDex : భారత అంతరిక్ష సంస్థ ఖాతాలో మరో రికార్డు.. స్పేడెక్స్ డాకింగ్ సూపర్ సక్సెస్
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో రికార్డులను సృష్టిస్తోంది. చైనా, రష్యా అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. తాజాగా ఆ దేశాల సరసన (ISRO) భారత్ చేరింది. డిసెంబర్ 30 న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్) నుంచి PSLV-C60 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. దీని నుంచి స్పేడెక్స్ 1A, స్పేడెక్స్ 1B రాకెట్ నుంచి విడిపోయాయి. తాజాగా వీటిని ఇస్రో విజయవంతంగా స్పేస్ డాకింగ్ (ISRO SpaDex) చేసినట్లు ప్రకటన చేసింది.
అప్పటి నుంచి మూడు సార్లు స్పేస్ డాకింగ్ (Space Docking) వాయిదా పడగా.. ఇవాళ స్పేస్ డాకింగ్‌ను పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఇందుకోసం ఈ రెండు శాటిలైట్ ల మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ చేశారు. దీంతో ఇస్రో మరో కీలక మైలురాయిని చేరినట్లు అయింది.

కొత్త సంవత్సరంలో తొలి విజయాన్ని ఇస్రో నమోదు చేసింది. స్పేస్ డాకింగ్ చేయగల సత్తా కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ స్పేడెక్స్ మిషన్ (ISRO SpaDex Mission) కోసం పనిచేసిన శాస్ర్తవేత్తలు, ఇతర టీం మెంబర్‌లు సహా భారతీయులకు అందరికీ భారత్ అంతరిక్ష పరిశోధన సంస్ధ (ISRO) అభినందనలు తెలిపింది.
PSLV C60 రాకెట్ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న ఉపగ్రహాల బరువు సుమారు 220 + 220 కేజీలుగా ఉంది. అంతరిక్షంలో అత్యంత వేగంతో పరిభ్రమిస్తున్న వాటిని స్పేస్ డాకింగ్ చేయడం ఎంతో సవాలుతో కూడుకున్నది. అయితే రాకెట్ ప్రయోగం నుంచి మూడు సార్లు డాకింగ్ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా విజయవంతంగా పూర్తి చేసింది.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
ఇస్రో సరికొత్త స్పేస్ డాకింగ్ టెక్నాలజీ భవిష్యత్ లో చేపట్టనున్న అనేక ప్రయోగాలకు ఉపయోగపడనుంది. ముఖ్యంగా భవిష్యత్‌లో నిర్మాణం చేపట్టనున్న భారత అంతరిక్ష కేంద్రం సహా చంద్రయాన్-4 గగన్‌యాన్ వంటి కీలక ప్రయోగాలకు ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుందని తెలుస్తోంది.
స్సేడెక్స్ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భారత శక్తి సామర్థ్యాలకు ఇది అద్దం పడుతోందని తెలిపారు. భవిష్యత్ ప్రయోగాలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని X లో పోస్ట్ చేశారు. మోడీ సారధ్యంలో మరిన‌్ని విజయాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
గగన్‌యాన్ కోసం ఇప్పటికే ఇస్రో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తొలిదశ టెస్టింగ్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. గత సంవత్సరం అక్టోబర్‌లో గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తున్న ఇస్రో గగన్‌యాన్‌ను చేపడుతోంది. ప్రాజెక్టులో ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడు రోజల పరిశోధనల అనంతరం సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు.


Click it and Unblock the Notifications








