నిషేధించిన చైనీస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు!! కారణం ఇదే

|

భారత ప్రభుత్వం గతంలో నిషేధించిన చైనా యొక్క యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇండియా మరియు చైనా యొక్క సరిహద్దు స్టాండ్-ఆఫ్ తర్వాత భారత్ దాదాపు 250 చైనీస్ యాప్ లను నిషేధించింది. కరోనా కారణంగా దాదాపుగా 23 వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్ అధ్యయనాల ద్వారా చదువుకుంటున్నారు. వీరిలో 20,000 మందికి పైగా వైద్య విద్యార్థులు వివిధ చైనా విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఉండడం గమనార్హం. తమ కోర్సులను కొనసాగించడానికి నిషేధిత మొబైల్ యాప్ లను డౌన్‌లోడ్ చేయమని వర్సిటీలు బలవంతం చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

 

వీచాట్

చైనాలోని చాలా విశ్వవిద్యాలయాలు వీచాట్, డింగ్‌టాక్, సూపర్‌స్టార్ మరియు టెన్సెంట్ యొక్క వీడియో చాట్ యాప్ లను ఉపయోగించి తమ యొక్క ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఈ యాప్ లకు యాక్సిస్ ను నిర్వహించి ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అవ్వవలసిందిగా వారు విద్యార్థులను కోరారు.

పెగాసస్ స్పైవేర్ నుండి మీ ఫోన్‌ను రక్షించే ఈ టిప్స్ మీద ఓ లుక్ వేయండి!!పెగాసస్ స్పైవేర్ నుండి మీ ఫోన్‌ను రక్షించే ఈ టిప్స్ మీద ఓ లుక్ వేయండి!!

ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ చైనా

ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ చైనా (ISC) లో సభ్యులుగా ఉన్న ఈ విద్యార్థులు ఈ విషయాన్ని చైనా, భారతీయ అధికారులతో తెలిపారు. తాత్కాలిక పరిష్కారంగా విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ద్వారా ఈ యాప్ లను యాక్సెస్ చేస్తున్నారు. ఈ విద్యార్థులు వార్షిక ట్యూషన్ ఫీజును రూ.3 లక్షల నుండి రూ.4.5 లక్షల మధ్య చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు భారత ప్రభుత్వం చైనా యొక్క ప్రయాణం కూడా నిషేధించింది.

ఆన్‌లైన్‌ తరగతులు
 

"ఇంతకుముందు మా యొక్క తరగతులు ఆన్‌లైన్‌లో WeChat యాప్ లో నిర్వహించబడ్డాయి. భారత ప్రభుత్వం దీనిని నిషేధించిన తరువాత మా విశ్వవిద్యాలయం మరొక చైనీస్ ప్లాట్‌ఫారమ్ డింగ్‌టాక్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. కానీ అది కూడా నిషేధించబడింది "అని ఢిల్లీకి చెందిన మరియు ప్రస్తుతం సూచో విశ్వవిద్యాలయంలో చదువుతున్న షారుఖ్ ఖాన్ అన్నారు.

నెట్‌వర్క్

"నెట్‌వర్క్ సమస్యల కారణంగా మేము ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరు కాలేకున్నాము. అలా అని సులభంగా నేర్చుకోవడానికి ఇది ఖచ్చితంగా సున్నితమైన అభ్యాసం మాత్రం కాదు. చాలా అవాంతరాల కారణంగా మాకు కొన్నిసార్లు ప్రాథమిక వివరాలు కూడా అర్థం కాలేదు "అని వడోదరలోని ఒక విద్యార్థి చెప్పారు.

మెడికల్ యూనివర్శిటీ

జైపూర్‌కు చెందిన నిమ్రత్ సింగ్ అనే విద్యార్థి ఇటీవల హార్బిన్ మెడికల్ యూనివర్శిటీలో రెండవ సంవత్సరం ఎంబిబిఎస్ పూర్తి చేశాడు. ఇప్పుడు భారతదేశంలో విదేశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్) పరీక్ష తప్పనిసరి అవ్వడంతో సింగ్ దానికి సిద్ధమవుతున్నాడు. "నేను ఎప్పుడు రెగ్యులర్ క్లాసులకు హాజరు అవుతానో నాకు తెలియదు మరియు ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావడంలో మేము పెద్ద సమస్యలను ఎదుర్కొంటాము. భారతదేశంలో నిషేధించబడిన టెన్సెంట్ యాప్‌లో నా విశ్వవిద్యాలయం తరగతులు నిర్వహిస్తోంది"అని సింగ్ అన్నారు.

గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

భారతదేశానికి చెందిన వివిధ సంస్థలు సమర్థ అధికారులతో సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాయి. "గుజరాత్ విద్యార్థుల తరపున, నేను మరియు మరికొందరు ఈ విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము" అని దక్షిణ గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్జిసిసిఐ) సభ్యుడు మనీష్ కపాడియా అన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Indian Students Trying to Download Banned Chinese Apps !! This are The Reasons

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X