లైంగిక వేధింపుల కేసులో భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తొమ్మిది నెలల జైలు

Posted By:

అమెరికాలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తొమ్మిది నెలల జైలు

విమానంలో ఓ అమెరికన్ యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలకు సంబంధించి ఓ భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అమెరికా న్యాయస్థానం తొమ్మిది నెలల జైలు శిక్షతో పాటు $5,000 డాలర్ల జరిమానాను విధించింది. శిక్షాకాలం పూర్తి అయిన అనంతరం ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దేశ బహిష్కరణ చట్టం క్రింద భారత్‌కు తిరిగివచ్చేయాల్సి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెలువరించిన వివరాల మేరకు శ్రీనివాసా ఎస్ ఇర్రమిల్లీ (45) అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా  విధులు నిర్వహిస్తున్నారు. ఈయన జూన్14, 2011న సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించారు. అదే విమానంలో లైంగిక వేధింపులకు గురైన మహిళ (65) తమ 35వ పెళ్లి వార్షికోత్సవాన్ని జరుపుకునే క్రమంలో భర్తతో కలిసి ప్రయాణం చేసింది.

ఆ సమయంలో బాధితురాలు కురచ నిక్కరును ధరించి ఉంది. బాధితురాలికి సమీపంలో కూర్చొని ఉన్న నిందితుడు ఆమె పై మూడు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తన దర్యాప్తులో భాగంగా వెల్లడించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ కేసుకు సంబంధించి వెలువరించిన తీర్పును వచ్చే బుధవారం మరోసారి స్థానిక అమెరికా న్యాయస్థానం పున: పరిశీలించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot