20-స్క్రీన్ మల్టీప్లెక్స్ OTT కంటెంట్‌ యాక్సెస్‌తో ఎక్స్‌స్ట్రీమ్ యూజర్లకు ఎయిర్‌టెల్ అనుమతి!!

|

దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం మెటావర్స్‌లో ఎక్స్‌స్ట్రీమ్ OTT (ఓవర్-ది-టాప్) కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్ కంపెనీ ఇటీవల పార్టీనైట్ మెటావర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించింది. 20-స్క్రీన్ మల్టీప్లెక్స్ ప్లాట్‌ఫారమ్‌తో ఇది తన అప్లికేషన్‌లో అందుబాటులో గల అనేక OTT ల కంటెంట్‌ను యాక్సెస్‌ చేయడానికి వినియోగదారులకు అనుమతిని అందిస్తుంది.

 

ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్‌

భారతి ఎయిర్‌టెల్ అందించే ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్‌తో వినియోగదారులు చూడాలనుకుంటున్న అన్ని రకాల OTT కంటెంట్‌లను చూడడానికి అనుమతిని ఇస్తుంది. దీనితో వినియోగదారులు టాప్ ఒరిజినల్ షోలు, సినిమాలు మరియు ముఖ్యమైన కొన్ని OTT షోల యొక్క మొదటి ఎపిసోడ్‌లు వంటి మరిన్నిటిని చూడడానికి అనుమతిని ఇస్తుంది. పూర్తి కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులు కంపెనీ నుండి పేమెంట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పొందవలసి ఉంటుంది.

తెలంగాణలో రూ.24,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్!! 3000లకుపైగా జాబ్స్తెలంగాణలో రూ.24,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్!! 3000లకుపైగా జాబ్స్

ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ ఉత్తేజకరమైన సౌండ్స్ ఎఫెక్ట్
 

ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ ఉత్తేజకరమైన సౌండ్స్ ఎఫెక్ట్

భారతీయ టెలికాం సంస్థ మెటావర్స్‌లో OTT ల కంటెంట్‌ను అందిస్తూ ముందుకు దూసుకెళ్లడం ఇదే తొలిసారి. పార్టీనైట్ తో కలిసి ఎక్స్‌స్ట్రీమ్ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ ను మెటావర్స్‌లో హోస్ట్ చేయబడింది. మెటావర్స్‌లో పరస్పర చర్య చేయడానికి వినియోగదారులు అనుమతించబడతారు. పార్టీనైట్ యొక్క సృష్టికర్త అయిన గామిట్రానిక్స్ యొక్క ఆలోచనలో భాగంగానే ఎయిర్‌టెల్ తో కలిసి పని చేసింది. ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ వెబ్ 3.0 అప్లికేషన్‌లు మరియు స్టోరీ టెల్లింగ్ లతో కలిపి వినియోగదారులకు మెరుగైన గొప్ప అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ మెటావర్స్‌తో ఎయిర్‌టెల్ సంస్థ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. OTT ప్లాట్‌ఫారమ్‌లను ప్రయత్నించేలా ప్రజలను తనవైపు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది పేమెంట్ చందాదారులను కలిగి ఉండడం అనేది గమనించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ డిజిటల్ CEO ఆదర్శ్ నాయర్ మీడియా సమావేశంలో తెలిపారు. రాబోయే రోజులలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కోసం 20 మిలియన్లకు పైగా పేమెంట్ చందాదారులను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కారణంగా కంపెనీకి ప్రత్యేక ప్రధాన ఆదాయ వనరులను పొందవచ్చు.

మెటావర్స్‌లో

మెటావర్స్‌లో OTT ప్లాట్‌ఫారమ్‌ను ఏకీకృతం చేయడం అనేది కంపెనీ యొక్క పురోగతిలో అద్భుతమైన చర్య. దేశవ్యాప్తంగా ఎక్స్‌స్ట్రీమ్ ప్లాట్‌ఫారమ్‌కు అధిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ కొత్త నిర్ణయంతో పేమెంట్ చందాదారులను జోడించడంలో ఎయిర్‌టెల్ కి సహాయపడవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాట్‌ఫారమ్ లో వినియోగదారులు ఒకే లాగిన్ తో వివిధ రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుండి OTT కంటెంట్‌ను చూడడానికి అనుమతి లభిస్తుంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' కొత్త ఫీచర్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' కొత్త ఫీచర్

సేఫ్ పే ఫీచర్ అనేది కొత్త విషయం ఏమి కాదు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది.

ఎయిర్‌టెల్ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌ కొత్త ఫీచర్

ఎయిర్‌టెల్ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌ కొత్త ఫీచర్

ఇండియాలోని రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారుల కోసం 'స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌' అనే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ యొక్క సిమ్ నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు తమకు వచ్చిన మిస్డ్ కాల్ ల యొక్క హెచ్చరికలను చూడగలరు. ఇది ప్రత్యేకమైన ఫీచర్ ఏమి కాదు జియో వినియోగదారులు ఇప్పటికే ఈ మిస్డ్ కాల్ అలెర్ట్ ఫీచర్ ని పొందుతున్నది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కి వెళ్ల మిస్డ్ కాల్ అలర్ట్‌ల విభాగాన్ని ఎంచుకున్నప్పుడు యూజర్‌లకు ఎయిర్‌టెల్ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు కనిపిస్తాయి.

Best Mobiles in India

English summary
Indian Telco Airtel Launches Xstream Multiplex OTT Content Platform in Metaverse

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X