వాణిజ్య దిగ్గజ సంస్థల సీఈవోలుగా భారత్‌ సీఈవోలే టాప్‌

Posted By: Super

వాణిజ్య దిగ్గజ సంస్థల సీఈవోలుగా భారత్‌ సీఈవోలే టాప్‌

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సీఈవోలే ప్రపంచవ్యాప్తంగా తమ హవా కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని టాప్‌ 10 గ్లోబల్‌ చీఫ్‌ సీఈవోలు కలిసి మొత్తం 400 బిలియన్‌ డాల ర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. భారత్‌ ప్రతి ఏటా ఎగుమతులు చేసే మొత్తం కంటే ఇది రెండింతలతో సమానం. బహుళ జాతి దిగ్గ జ్జాలాంటి సంస్థలైన సిటీగ్రూపు, డ్యూయిష్‌ బ్యాంకు, పెప్సీకో, యూనీలీవర్‌, అడోబ్‌, మాస్టర్‌కార్డ్‌, మోటారోలా లాంటి కంపెనీ సీఈ వోలు భారత సంతతికి చెందినవారే కావడం విశేషం.

నిపుణుల అభి ప్రాయం ప్రకారం భారతీయులు ఉన్నత విద్యపై ఎక్కువ దృష్టి పెడతారని కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరింత దృష్టి పెట్టి వాటికి పరిష్కార మార్గం కనుగొంటారని... అందువల్లే భారతీయులు అత్యున్నత పదవు ల్లోకి వెళుతున్నారని భవిష్యత్తులో మరింత మంది సీవోలు గ్లోబల్‌ కంపెనీల్లో చేరుతారని వారు అభిప్రాయపడుతున్నారు. సుమారు ఒక డజను అతి పెద్ద గ్లోబల్‌ కంపెనీలు భారత్‌ అవతల ఉన్నాయి. వాటిలో భారత సంతతికి చెందిన వారు అత్యున్నత పదవుల్లో ఉన్నారు. మరో డజనుకుపైగా ఉన్న చిన్న కంపెనీల్లో మిడ్‌ లెవెల్‌ స్థాయిలో భారతీయులు హవా కొనసాగిస్తున్నారు. తాజాగా జర్మనీకి చెందిన డ్యూయిస్‌ బ్యాంకులో భారత సంతతికి చెందిన సీఈవో అన్షుజైన్‌ చేరారు.

10 మంది భారతీయులు సీఈవోలుగా ఉన్న గ్లోబల్ కంపెనీల టర్నోవర్ 40 వేల కోట్ల డాలర్లని అంచనా. ఈ విలువ-ఒక ఏడాదిలో భారత్ ఎగుమతులకు దాదాపు రెట్టింపు. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతుకు సమానం. సిటీ గ్రూప్, డాషే బ్యాంక్, పెప్సికో, యూనిలివర్, అడోబ్, మాస్టర్ కార్డ్, మోటోరోలా వంటి దాదాపు పదికి పైగా గ్లోబల్ కంపెనీల ఉన్నత స్థానాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక మధ్య స్థాయిల్లో, చిన్న కంపెనీల్లో మరింతమంది ఉంటారని అంచనా. గ్లోబల్ బాస్‌లకు భారత్ ఆదర్శవంతమైన శిక్షణ స్థలి అని టైమ్ మ్యాగజైన్ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot