Home
News

ఇండియాలో బ్యాంకింగ్ OTP SMS డెలివరీ అంతరాయానికి కారణాలు ఇవే...

ఇండియాలో డిజిటల్ పద్దతిలో పేమెంట్స్ చేయడం మొదలైనప్పటి నుంచి అందరూ దాదాపుగా అదే పద్దతిని పాటిస్తున్నారు. అలాగే షాపింగ్ కోసం కూడా ఆన్ లైన్ పద్దతిలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇండియాలో గత రెండు రోజుల నుంచి చాలా మంది వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) డెలివరీ సమస్యను ఎదురుకొంటున్నారు. SMS అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేయడానికి చాలా మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. మీరు కూడా అదే సమస్యను అనుభవించినట్లయితే దానికి గల కారణం గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మాటల్లో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SMS అంతరాయం వెనుక అసలు కారణం

SMS అంతరాయం వెనుక అసలు కారణం

నెట్‌వర్క్ నాణ్యత సరిగా లేకపోవడం వల్ల SMS ప్రధాన సమస్య సంభవించిందని చాలామంది భావించినప్పటికీ SMS అంతరాయం వెనుక అసలు కారణం పూర్తిగా భిన్నంగా ఉంది. వివిధ మీడియా నివేదికల ప్రకారం ఇండియా యొక్క కొత్త బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అయిన డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ఈ భారీ SMS అంతరాయానికి కారణమని ఆరోపించారు. కొత్త DLT టెక్నాలజీతో రిజిస్టర్డ్ టెంప్లేట్‌తో ప్రతి SMS‌ను ధృవీకరించడం తప్పనిసరి చేయడం ద్వారా స్పామ్ సందేశాలను అరికట్టే ఆలోచన ఉంది.

అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్

జూన్ 2020 లో టెలికాం పర్యవేక్షణ సంస్థ అన్ని ఆపరేటర్లకు అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) కు సంబంధించిన సమస్యలను అరికట్టడానికి త్వరలో ఒక వ్యవస్థను తీసుకువస్తుందని తెలియజేసింది. ఇటీవల DLT అధీకృత ఆటోమేటెడ్ మెసేజింగ్ సేవలకు కొత్త మెసేజింగ్ ఆకృతిని అనుసరించడానికి బ్యాంకులు మరియు ఇతర డిజిటల్ పేమేట్ సేవలను తప్పనిసరి చేసింది. ఈ ఫార్మాట్‌ను టెలికాం ఆపరేటర్ల సమ్మతి కోసం ఉంచుతారు. అదనంగా అన్ని బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు కూడా బల్క్ మెసేజింగ్ సేవలను పంపే ముందు క్లియరెన్స్ పొందాలి.

SMS అంతరాయానికి ముందు ఏం జరిగింది?

SMS అంతరాయానికి ముందు ఏం జరిగింది?

భారతదేశంలో OTP SMS సేవలు మార్చి 7 న కొంతవరకు మరియు మార్చి 8 న పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ఈ రెండు రోజులలో OTP లను ఉత్పత్తి చేయడంలో ఆలస్యం అయ్యింది. దేశంలోని టెలికాం కంపెనీలు కొత్త SMS నిబంధనలలో రెండవ దశను అమలు చేసిన తర్వాత ఈ సమస్యలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా వినియోగదారులు బ్యాంకులు మరియు ఇ-కామర్స్ సంస్థల నుండి OTP లు వంటి కీలకమైన SMS సేవలకు అంతరాయం కలిగాయని చాలా మంది ఫిర్యాదు చేశారు.


ఇదిలావుండగా, అదే రోజున 40 నుండి 50 శాతం సేవలకు అంతరాయం ఏర్పడిందని IT నివేదిక పేర్కొంది. "కంటెంట్ స్క్రబ్బింగ్ కారణంగా 50 శాతం ట్రాఫిక్ శాతం పడిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐలతో సహా భారతదేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల అధికారులు చాలా కోపంగా ఉన్నారు మరియు త్వరగా ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి ట్రాయ్‌కు డయల్ చేస్తున్నారు" అని ఒక టెలిమార్కెటింగ్ సంస్థలో ఉన్నతాధికారి ఒకరు వార్తాపత్రిక పేర్కొన్నారు. మరోవైపు, టెలికాం ఆపరేటర్లు భారతదేశంలో అంతరాయాలకు డిఎల్‌టి సంస్థలు కారణమని చెప్పారు.

 

TRAI యొక్క నిర్ణయం

TRAI యొక్క నిర్ణయం

TRAI కూడా ఈ సమస్యను బుధవారం అంగీకరించింది. అలాగే DLT అమలును నిలిపివేసినట్లు కూడా ప్రకటించింది. ఇది రిజిస్టర్డ్ టెంప్లేట్‌తో ప్రతి SMS తప్పనిసరి ధృవీకరణను నిర్ధారిస్తుంది. అలాగే ప్రస్తుతం SMS స్క్రబ్బింగ్ వ్యవస్థను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రాయ్ అధికారికంగా ప్రకటించింది. టెలికాం రెగ్యులేటరీ అధికారి ఒక ప్రకటనలో "మార్చి 8 కస్టమర్ల SMS అసౌకర్యానికి సంబంధించి మేము ఆందోళన చెందుతున్నాము మరియు SMS స్క్రబ్బింగ్‌ను మరొక 7 రోజుల తాత్కాలిక సస్పెన్షన్‌కు ఆదేశించాము." అని ప్రకటించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Indians Facing Interruption of OTP SMS Delivery Reasons TRAI Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X