వైఫై ఇప్పుడు ఎంత డేంజరంటే..?

Written By:

మీరు ఉచిత వైపై కోసం వెతుకుతున్నారా..ఇప్పుడు అది చాలా రిస్క్ తో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉచిత వైఫై కోసం మీరు ఇచ్చే వివరాలతో మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నార్టన్‌ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ఇటీవల పబ్లిక్‌ వైఫై వాడకం తీరుతెన్నులపై 15 దేశాల్లో విస్తృత సర్వే చేపట్టింది. పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.

ఏడాది వారంటి, 8 కొత్త మోడళ్లతో మళ్లీ రీ ఎంట్రీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని

పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని వారి చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది.

నార్టన్‌ వైఫై ప్రైవసీ

సైమాంటిక్‌ అభివృద్ధి చేసిన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ‘నార్టన్‌ వైఫై ప్రైవసీ'వంటివి వాడకం ద్వారా సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.

వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్‌లలో

ఆన్‌లైన్‌ సెక్యూరిటీ కోసం వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్‌లలో హెచ్‌టీటీపీఎస్‌ ప్రొటోకాల్‌ ఉందో.. లేదో.. చూసుకోవాలి. అయితే నెట్‌వర్క్‌ సురక్షితంగా లేకపోతే హెచ్‌టీటీపీఎస్‌ ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వైఫై నెట్‌వర్క్‌ ఆటోమేటిక్‌గా కనెక్టయ్యే ఆప్షన్స్‌ ఉంటే వాటిని వాడకపోవడమే మేలు.

బ్యాంక్‌ అకౌంట్లు

సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్‌ చేసేందుకూ అనుమతించే వారు 19%
పబ్లిక్‌ వైఫై ద్వారా బ్యాంక్‌ అకౌంట్లు చూసుకోవడం, ఫొటోలు షేర్‌ చేసుకునే వారు 96%

కొత్త చోటికి వెళితే

పబ్లిక్‌ వైఫై వాడినా తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74%
కొత్త చోటికి వెళితే వైఫైలోకి ప్రవేశించేందుకు నిమిషమూ నిలవలేని వారు 51%

వ్యక్తిగత ఈమెయిల్

వ్యక్తిగత ఈమెయిల్, కాంటాక్ట్స్‌ వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారు 19%
వైఫైతో పోలిస్తే సురక్షితమైన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను వాడే వారు 48%

అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు

పబ్లిక్‌ వైఫైతో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31%

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indians put personal information at risk while using public Wi-Fi: Norton Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot