గూగుల్ గుడ్ న్యూస్ : ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు డేటా సేవింగ్ ఫీచర్స్

By Gizbot Bureau
|

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ టెక్ రంగంలో శరవేగంగా దూసుకువెళుతోంది. కొత్త కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ మరో సరికొత్త ఫీచర్ ని ఇండియాలోని ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ ప్రధాన ఉద్దేశం డేటానే సేవ్ చేయడమేనని గూగుల్ చెబుతోంది. స్ట్రీమింగ్ వీడియోలు చూస్తున్న సమయంలో మీ డేటా అయిపోకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది. ఇండియాలో ఆండ్రాయిడ్ టీవీల మార్కెట్ రోజు రొజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్ ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

వేధిస్తున్న వైఫై సమస్య

వేధిస్తున్న వైఫై సమస్య

ఇండియాలో చాలా చోట్ల వైఫై అందుబాటులో లేదు. స్ట్రీమింగ్ వీడియోస్ కోసం యూజర్లు స్మార్ట్ ఫోన్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. వీరంతా స్మార్ట్ ఫోన్ నుంచి హాట్ స్పాట్ ఆన్ చేసి వీడియోలు స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీని వల్ల డేటా మొత్తం క్షణాల్లో అయిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ 4 ప్రధాన ఫీచర్లను ప్రవేశ పెట్టింది. ఈ ఫీచర్లు అన్నీ గూగుల్ ఫైల్స్ యాప్ ద్వారా రన్ అవుతాయి.

డేటా సేవర్

డేటా సేవర్

ఈ ఫీచర్ ద్వారా మీరు మీ డేటా వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడున్న దానికన్నా మూడు రెట్లు ఎక్కువగా వీడియోలను ఈ ఫీచర్ ద్వారా తిలకించవచ్చు. 

డేటా అలర్ట్స్

డేటా అలర్ట్స్

మీరు ఎప్పటికప్పుడు డేటా అలర్ట్ వస్తుంది. మీ డేటా వీడియో చూస్తున్న సమయంలో ఎంత అయిపోతుందనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు.

హాట్ స్పాట్ గైడ్

హాట్ స్పాట్ గైడ్

ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ టీవీకి యూజర్లు స్మార్ట్ ఫోన్ ద్వారా ఎలా కనెక్ట్ కావాలో తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ నుంచి హాట్ స్పాట్ తో ఎలా కనెక్ట్ కావాలనే దానికి పూర్తి గైడ్ ఈ ఫీచర్ లో లభిస్తుంది.

కాస్ట్ ( Cast ) ఫీచర్

కాస్ట్ ( Cast ) ఫీచర్

ఈ ఫీచర్ ఫైల్స్ యాప్ కొరకు తీసుకువచ్చారు. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ మొబైల్ నుండి వీడియో డైన్లోడ్ చేస్తున్న సమయంలో దాన్ని టీవి ద్వారా చూడవచ్చు. దీనికి ఎలాంటి డేటా అవసరం ఉండదు. 

ఈ టీవీలకు అందుబాటులో..

ఈ టీవీలకు అందుబాటులో..

గూగుల్ ఈ కొత్త ఫీచర్లను ప్రస్తుతానికి కొన్ని టీవీలకు మాత్రమే అందించింది. Xiaomi, TCL and MarQ by Flipkart కంపెనీల స్మార్ట్ టీవీలకు మాత్రమే ముందుగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇది బీటా వర్సన్ లో ఉంది. రానున్న వారాల్లో ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్ అమిత వేగంతో ముందుకు వెళుతోంది. షియోమి ఇప్పటికే టాప్ లో దూసుకుపోతోంది. మోటోరోలా , వన్ ప్లస్ నుంచి ఆండ్రాయిడ్ టీవీలు త్వరలో ఇండియాలో లాంచ్ కానున్నాయి.

Best Mobiles in India

English summary
Indians will soon get these data-saving features on their Android TVs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X