పాస్‌వర్డ్‌లపై శుభవార్తను అందించిన కేంద్ర ప్రభుత్వం
యూజర్లకు ఇకపై పాస్‌వర్డ్‌లకు సంబంధించి ఎటువంటి భయం అవసరం లేదనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం అందించింది.
యూజర్లకు ఇకపై పాస్‌వర్డ్‌లకు సంబంధించి ఎటువంటి భయం అవసరం లేదనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం అందించింది. గోప్యతను సాధారణ హక్కుగా గుర్తిస్తూ వ్యక్తిగత సమాచార భద్రతపై ఒక ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా ఎవరైనా కొన్ని రకాల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. 'స్పష్టమైన అనుమతులు' ఉండాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనలేవైనా జరిగితే భారీ అపరాధ రుసుములు విధించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లు పూర్తి వివరాల్లోకెళితే...

జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో..
వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2018 ముసాయిదాను.. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయీ సంఘం సిఫారసుల మేరకు రూపొందించారు.

వ్యక్తిగత సమాచార బదిలీపై..
వ్యక్తిగత సమాచార బదిలీపై ఈ బిల్లు ద్వారా షరతులను విధించొచ్చు. అంతే కాకుండా.. డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. సమాచార భద్రతపై నివేదికను, ముసాయిదా బిల్లును కూడా ఈ ప్యానెల్ ప్రభుత్వానికి సమర్పించింది.

వ్యక్తిగత సమాచార నిబంధనలను
ఏదైనా డేటా సేకరణ సంస్థ వ్యక్తిగత సమాచార నిబంధనలను ఉలంఘించినట్లయితే మొత్తం ప్రపంచ వ్యాప్త టర్నోవరులో 4 శాతం లేదా రూ.15 కోట్లు వరకు అపరాధ రుసుము విధిస్తారు.

2 శాతం వరకు
డేటా భద్రత ఉల్లంఘనపై సరైన చర్యలు తీసుకోకపోతే రూ.5 కోట్లు లేదా టర్నోవరులో 2 శాతం వరకు(రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది) అపరాధ రుసుము విధిస్తారు.

సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని
పాస్‌వర్డ్‌లు, ఆర్థిక గణాంకాలు, ఆరోగ్య గణాంకాలు, శృంగార జీవితం, శృంగార వైఖరి, బయోమెట్రిక్, జెనటిక్ సమాచారం, కులం లేదా మతం లేదా రాజకీయ విశ్వాసాలు లాంటి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని ఈ బిల్లు ప్రభావితం చేయనుంది.

డేటా ప్రిన్సిపల్ అనుమతితోనే
ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని డేటా ప్రిన్సిపల్ అనుమతితోనే సేకరించాలి. (అంతకుముందు తీసుకోవడానికి అనుమతి లేదు.) అయితే అందుకు తగ్గ స్పష్టమైన, నిర్దిష్ట, చట్టబద్ధమైన కారణాలను చెప్పాల్సి ఉంటుంది.

డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా..
జాతీయ భద్రత, నేర దర్యాప్తు, న్యాయ విచారణలు, కొన్ని పాత్రికేయ అవసరాలకు మాత్రం చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా అరికడుతుంది. సమాచార భద్రతపై స్పృహను పెంచుతుంది. అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది.

గోప్యత హక్కును సాధారణ హక్కుగా
గోప్యత హక్కును సాధారణ హక్కుగా ఈ బిల్లు అందజేస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని సమాచార గోప్యత కింద పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆ ముసాయిదా పేర్కొంది. ఏదైనా చట్టం, పార్లమెంటు చర్య లేదా రాష్ట్ర చట్ట సభల కోసం మాత్రమే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలి.

10 మంది సభ్యులతో కూడిన కమిటీ
గతేడాది జులైలో 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యక్తిగత డేటాకు భద్రతనిచ్చే ఒక వ్యవస్థ ఏర్పాటుకు తగిన సూచనలు ఇవ్వాలని కోరింది. కమిటీ తన నివేదికను ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సమర్పించింది.


Click it and Unblock the Notifications








