మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు మొదటి సమస్య!

Posted By:

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహానికి మొదటి సమస్య ఎదురైంది. విజయవంతంగా లాంచ్ కాబడిన భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఈ ఉప్రగహానికి సంబంధించి కక్ష్యను పెంచే క్రమంలో సోమవారం చేపట్టిన చర్య పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. దింతో నిర్థేశిత కక్ష్యలోకి మామ్ చేురుకోలేకపోయింది. శాటిలైట్‌లోని ద్రవ ఇంజన్‌లోకి ఇంధన ప్రవాహం ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఇస్రో పేర్కొంది. అయితే, మామ్ అంగారక యాత్ర పై ఎటువంటి ఆందోళనలు, అనుమానాలు అవసరంలేదని ఇస్రో స్పష్టం చేసింది. మామ్ ఉప్రగాహాన్ని ఈ నెల 5వ తేదీన ‘పీఎస్ఎల్ వీ-సీ25' రాకెట్ ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు మొదటి సమస్య!

అప్పటి నుంచి శాస్త్రవేత్తల మూడు సార్లు ఉపగ్రహంలోని లిక్విడ్ అపోజీ మోటర్ (లామ్)ను ప్రజ్వలింపచేసి దాని కక్ష్యను విజయవంతంగా పెంచుతూ వచ్చారు. ఆదివారం అర్థరాత్రి దాటాక 2.06 గంటలకు నాలుగోసారి ఉపగ్రహ కక్ష్యను పెంచేందుకు ఇస్రోచర్యలు చేపట్టింది. కక్ష్యలో భూమికి దూరంగా ఉండే బిందువును 71,623కిలోమీటర్ల నుంచి లక్ష కిలోమీటర్లకు పెంచాలన్నది దీని ఉద్దేశ్యం. అయితే మామ్ 78,623 కిలోమీటర్ల దూరమే చేురుకోగలిగింది. ఉపగ్రహ వేగం సెకనుకు 135 మీటర్లు అందుకోవల్సి ఉండగా, 35 మీటర్లే పెరగడం కారణంగా సమస్యల తలెత్తినట్లు ఐస్రో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉప్రగహాన్ని లక్ష కిలోమీటర్ల కక్ష్యలోకి చేర్చేందుకు అనుబంధ కక్ష్య పెంపు ఆపరేషన్ ను మంగళవారం తెల్లవారుజామున ఇస్రో విజయవంతంగా చేపట్టిందింది. దీంతో మార్స్ ఆర్బిటర్ మిషన్ నిర్థేశిత లక్ష్యం వైపు కొనసాగుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting