ఇండియా అదుర్స్ (3 నెలల్లో 5 కోట్ల మొబైళ్ల అమ్మకాలు)!

Posted By: Super

ఇండియా అదుర్స్ (3 నెలల్లో 5 కోట్ల మొబైళ్ల అమ్మకాలు)!

 

ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి 5 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయని సైబర్‌మీడియా రీసెర్చ్ ఇండియా మంత్లీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్ రివ్యూ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 9.1% వృద్ధి సాధ్యమైందని ఈ అధ్యయనం పేర్కొంది. దీని ప్రకారం... 23% మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నోకియా నిలుపుకుంది. 14% మార్కెట్ వాటాతో శామ్‌సంగ్ రెండో స్థానంలో, 5.8% మార్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ 3వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 27 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఈ కేటగిరిలో 40% మార్కెట్ వాటాతో శామ్‌సంగ్ టాప్‌లో నిలిచింది. 26% మార్కెట్ వాటాతో నోకియా, 12% వాటాతో రిమ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అంచనాలో దిమ్మ తిరిగే లెక్కలు!

2014నాటికి దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు చేరుకునే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ విశ్లేషించినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. మొబైల్ హ్యాండ్‌సెట్లకు డిమాండ్‌కు సంబంధించి ఐసీఏ అంచనాలను మంత్రి ఆ సమాధానంలో వివరించారు. ఆ వివరాల ప్రకారం… ప్రస్తుత సంవత్సరంలో 20 కోట్ల మొబైళ్లకు (వీటి విలువ రూ.43,000 కోట్లు) డిమాండ్ ఉంటుంది. 2011లో ఈ డిమాండ్ 18 కోట్లకు(రూ.38,200 కోట్లు) ఉండగా. 2010లో 15 కోట్లుగా(రూ.34,500 కోట్లు) ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot