Home
News

షియోమీ ఇండియాతో ఇండస్‌ యాప్‌స్టోర్‌ డీల్‌.. దీని వల్ల ఏం జరుగుతుంది..?

ఇండస్‌ యాప్‌ ‌స్టోర్‌ ఫిబ్రవరి 2024 లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ కు ప్రత్యామ్నయంగా దీని తీసుకొచ్చారు. విడుదల సమయంలో ఈ యాప్‌ స్టోర్‌ లో సుమారు 200,000 యాప్స్‌ ఉన్నాయి. ఫోన్‌పేకు చెందిన ఇండస్‌ యాప్‌ స్టోర్‌ పై (Indus Appstore) కీలక ప్రకటన వెలువడింది. షియోమీ ఇండియా, ఇండస్‌ యాప్‌ స్టోర్‌ల మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు ఫోన్‌పే వెల్లడించింది.

కొత్త యాప్‌ స్టోర్‌ :
ఈ కొత్త ఒప్పందం కారణంగా షియోమీ ఇండియా (Xiaomi india) ఫోన్‌లు ప్రీ ఇన్‌స్టాల్డ్‌ గా రానున్నాయి. భారత్‌లో భవిష్యత్‌ వచ్చే అన్ని షియోమీ ఫోన్‌లు ఇండస్‌ యాప్‌ స్టోర్‌ లో రానున్నాయి. షియోమీ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు భవిష్యత్‌ లో రెడ్‌మి, పోకో హ్యాండ్‌సెట్‌లు కూడా ఈ కొత్త యాప్‌ స్టోర్‌తోనే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

indus app store deal with Xiaomi india

ఫోన్‌పే అధికారిక ప్రకటన :
షియోమీ ఇండియా, ఇండస్‌ యాప్‌ స్టోర్‌ భాగస్వామ్యంపై ఫోన్‌పే అధికారిక ప్రకటన చేసింది. భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన డిజిటల్ వ్యవస్థను అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న షియోమీ డివైజ్‌ ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంను కలిగి ఉన్నాయి.

అయితే ఇండస్‌ యాప్‌ స్టోర్‌ మరియు షియోమీ ఇండియా మధ్య ఆర్థిక వ్యవహారాల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ కొత్త నిర్ణయం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతి అందించడమే లక్ష్యమని తెలిపింది. దీంతోపాటు మరింత మంది యూజర్లను చేరుకోవడం సహా డెవలపర్‌లకు సపోర్టుగా ఉంటుందని తెలిపింది.

షియోమీ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ సుధిన్ మాథుర్‌ ఈ వివరాలు వెల్లడించారు. దీంతోపాటు ఇండస్‌ యాప్‌స్టోర్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రియా ఎం నరసింహన్ ఈ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. స్మా్ర్ట్‌ఫోన్‌ యూజర్లు, యాప్‌ డెవలపర్‌లకు మెరుగైన ప్లాట్‌ఫాం నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఇండస్‌ యాప్‌ స్టోర్‌ 2024 ఫిబ్రవరిలో లాంచ్‌ చేశారు. ఈ యాప్‌ స్టోర్‌ 12 భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. మరియు స్థానిక భాషల యూజర్‌లకు సులభంగా వినియోగించుకొనేలా ఉంటుందని తెలిపింది. మరియు 10 భారతీయ భాషల్లో వాయిస్‌ కమాండ్‌లకు సపోర్టు చేస్తుంది.

షియోమీ నుంచి ఇటీవల షియోమీ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. రెండు మోడళ్లు కూడా ఫ్లాగ్‌షిప్‌ వెర్షన్‌లుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్‌ LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS తో లాంచ్‌ అయ్యాయి.

ఈ సిరీస్‌ Leica భాగస్వామ్యంతో కెమెరాను కలిగి ఉంది. బేస్‌ వేరియంట్ ధర రూ.64999 గా ఉంది. అల్ట్రా వేరియంట్‌ ధర రూ.1,09,999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో డిస్కౌంట్‌ను పొందవచ్చు. షియోమీ ఇండియా ఇ-స్టోర్‌తోపాటు అమెజాన్‌ ద్వారా త్వరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
indus app store deal with Xiaomi india, what will happen with this
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X