ఇండస్ కీబోర్డుతో తెలుగు టైపింగ్ మరింత సులభం

భారతదేశపు తొలి మొబైల్ ఆపరేటిగ్ సిస్టం ఇండస్ (Indus), సరికొత్త కీబోర్డును అనౌన్స్ చేసింది. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా ఇండియన్ సెంట్రిక్ ఫీచర్లతో రూపొందించబడిన ఈ లేటెస్ట్ వర్షన్ కీబోర్డ్‌కు స్పీడ్ టు టెక్స్ట్ ఫీచర్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

Read More : నోకియా 6కు గట్టిపోటీ ఇస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపరేటింగ్ సిస్టం లెవల్‌లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత

స్పీడ్ టు టెక్స్ట్ ఫీచర్, యూజర్ మాట్లాడిన మాటలను రికగ్నైజ్ చేసిన వాటి టెక్స్ట్ రూపంలో డిస్‌ప్లే చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టం లెవల్‌లో ప్రాంతీయ భాషలకు స్పీడ్ టు టెక్స్ట్ ఫంక్షనాలిటీని అందుబాటులోకి తీసుకురావటమనేది ఇండియన్ స్మార్ట్ కమ్యూనికేషన్ విభాగానికి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.

అదనపు యాప్స్ లేదా డౌన్‌లోడ్స్ అవసరం ఉండదు

ఇండస్ ఆపరేటింగ్ సిస్టంతో డీఫాల్ట్‌గా వచ్చే ఈ కోబోర్డ్‌కు అదనపు యాప్స్ లేదా
డౌన్‌లోడ్స్ అవసరం ఉండదు. ఈ కీబోర్డ్ మొత్తం 23 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

ఇండస్ కీబోర్డ్ సపోర్ట్ చేసే భాషల వివరాలు

తెలుగు, తమిళం, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, నేపాలీ, బోడో, డోగ్రీ, సంస్కృతం, కోంకణి, మైథిలి, సింథీ, కశ్మీరీ, మణిపురీ, అరబిక్, సాంతిలి, ఇంగ్లీష్.

కీబోర్డ్ ఫీచర్ డీఫాల్ట్‌గా లభిస్తుంది

ఇండస్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఈ కీబోర్డ్ ఫీచర్ డీఫాల్ట్‌గా లభిస్తుంది. మైక్రోమాక్స్, ఇంటెక్స్, సెల్‌కాన్, స్వైప్, కార్బన్, ట్రయో వంటి కంపెనీలు ఇప్పటికే ఇండస్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన ఫోన్ లను మార్కెట్లో అందిస్తున్నాయి.

సెల్ఫీ ఫోటోలను జిఫ్ ఫైల్స్‌గా మార్చేసుకోవచ్చు

ఇండస్ అందుబాటులోకి తీసుకువచ్చిన లేటెస్ట్ వర్షన్ కీబోర్డ్ ద్వారా సెల్ఫీస్ ఇంకా ఫోటోలను స్టిక్కర్స్ లేదా జిఫ్ ఫైల్స్‌గా మార్చేసుకోవచ్చు. ఆటో-కరెక్షన్, టెక్స్ట్ టు స్పీచ్, హింగ్లిష్ కీబోర్డ్ వంటి అదనపు ఫీచర్లను ఈ కీబోర్డులో పొందుపరిచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indus OS launches new keyboard to free you from typing!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot