Infinix నుంచి180W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీ మొబైల్స్?

|

ఇటీవ‌లి కాలంలో స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల సంఖ్య బాగా పెరిగింది. క్ర‌మంగా స్మార్ట్‌ఫోన్ల‌లో యూజ‌ర్లు వెచ్చించే స‌మ‌యం కూడా పెరిగింది. దీంతో యూజ‌ర్లు త‌మ మొబైల్స్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్ విధానాల కోసం ప్ర‌యత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలో యూజ‌ర్ల అవస‌రానికి అనుగుణంగా ప‌లు కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీకి సంబంధించి కొత్త మోడ‌ల్స్‌ను తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌యత్నాలు అయితే ప్రారంభించాయి. తాజాగా Infinix కంపెనీ అత్య‌ధికంగా 180వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీ క‌లిగిన మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవ‌ల అందుకు సంబంధించిన విష‌యాన్ని ఫేస్‌బుక్‌లో వెల్ల‌డించ‌డం విశేషం.

Infinix Fast Charging

"థండర్ ఛార్జ్ సిస్టమ్":
Infinix సంస్థ Facebook వేదిక‌గా ఒక చిన్న క్లిప్ ద్వారా కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన దృశ్యాన్ని విడుద‌ల చేసింది. 180W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీ రేటింగ్ క‌లిగిన‌, దీనిని "థండర్ ఛార్జ్ సిస్టమ్" అని పేరు పెట్టింది. Infinix సాధించిన వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాల‌జీ అని అందులో పేర్కొంది. OnePlus మరియు Realme వంటి ఇతర ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEM) ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను 150W వరకు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో షిప్పింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఇన్ఫినిక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కు సంబంధించి ఈ అప్‌డేట్ చేయ‌డం విశేషం. మ‌రోవైపు, ఇప్ప‌టికే Vivo సబ్-బ్రాండ్ iQoo కూడా 200W ఛార్జింగ్ టెక్నాలజీ తో iQoo 10 ప్రోని ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని ప‌లు రూమ‌ర్స్ వ‌చ్చాయి.

Infinix ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీకి సంబంధించి ఆ కంపెనీ స‌హ వ్యవస్థాపకుడు బెంజమిన్ జియాంగ్ 10-సెకన్ల చిన్న వీడియోను పంచుకున్నారు, దీనిలో స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కనిపిస్తుంది. జియాంగ్ మాట్లాడుతూ, "థండర్ ఛార్జ్" అనేది కంపెనీ ఇప్పటివరకు చేసిన అత్యంత వేగవంతమైన ఛార్జ్ అని చెప్పారు. గత సంవత్సరం రూపొందించిన‌ Infinix కాన్సెప్ట్ ఫోన్ 2021లో గరిష్టంగా 160W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు కేవలం 10 నిమిషాల్లో 4,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. కాగా, ఇప్ప‌టికే OnePlus మరియు Realme వంటి ఇతర ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEM) ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను 150W వరకు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో షిప్పింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఇన్ఫినిక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కు సంబంధించి ఈ అప్‌డేట్ చేయ‌డం విశేషం.

Infinix Fast Charging

Infinix కాన్సెప్ట్ ఫోన్ 2021 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.8 అంగుళాల డిస్‌ప్లే 720 x 1640 Pixels రిసొల్యూష‌న్ ను అందిస్తున్నారు. ఇది Octa-core (2x2.05 GHz Cortex-A76 & 6x2.0 GHz Cortex-A55) Mediatek Helio G95 (12 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 13 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మ‌రొక కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 160వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో 4,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఇది డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వ‌ర్శ‌న్‌ క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Infinix 180W Thunder Charge System Teased, Company Says Speed Is Its Fastest Yet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X