Home
News

రూ.13,999కే 40-అంగుళాల QLED స్మార్ట్ టీవీ.. ఈ ఇన్ఫినిక్స్ టీవీ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Infinix 40Y1V QLED Smart TV: భారతదేశంలో స్మార్ట్ టీవీలకు కొదవ లేదు. కానీ, తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో, ముఖ్యంగా పెద్ద సైజులో లభించే టీవీలు మాత్రం చాలా తక్కువ. ఈ ఖాళీని గుర్తించి, ఇన్ఫినిక్స్ కంపెనీ సరికొత్త 40Y1V QLED స్మార్ట్ టీవీని మన దేశంలో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ టీవీ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి ఈ టీవీ విశేషాలు, ధర వివరాలు చూద్దాం.

* డిస్‌ప్లే, డిజైన్

ఈ టీవీకి 40-అంగుళాల క్యూఎల్‌ఈడీ (QLED) ఫుల్ HD+ డిస్‌ప్లే ఇచ్చారు. పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1,080x1,920 పిక్సెల్ రిజల్యూషన్‌తో, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియోలు సూపర్ స్మూత్‌గా కనిపిస్తాయి. అంటే చాలా ఫాస్ట్‌గా కదిలే బొమ్మలు కూడా స్మూత్‌గా కనిపిస్తాయి.

Infinix 40Y1V QLED Smart TV Launched in India  Check Specs  amp amp  Price

పెద్ద డిస్‌ప్లే సైజు ఉంటుంది కాబట్టి అన్నీ ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తుంది. అలాగే ఇది బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. అంటే స్క్రీన్ చుట్టూ బోర్డర్ లేకుండా ఉండటంతో సినిమా చూస్తున్నా, గేమ్ ఆడుతున్నా ఫుల్ ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ మీ సొంతం. 300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో వెలుతురు ఎక్కువగా ఉన్న గదిలోనూ పిక్చర్స్ క్లియర్‌గా కనిపిస్తాయి.

* సౌండ్, ఆడియో ఫీచర్లు

సౌండ్ విషయానికొస్తే, ఈ స్మార్ట్ టీవీలో రెండు 8W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి, అంటే మొత్తం 16W ఔట్‌పుట్. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటంతో సౌండ్ క్వాలిటీ అదిరిపోతుంది. సౌండ్ మోడ్స్ కూడా ఐదు రకాలు ఇచ్చారు. అవి స్టాండర్డ్, సాకర్, మూవీ, మ్యూజిక్, యూజర్. చూసే కంటెంట్‌ను బట్టి సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

* పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఈ టీవీ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ31 GPU ఉంది. టీవీ స్పీడ్‌గా పనిచేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. స్టోరేజ్ మాత్రం 4GB ఇచ్చారు. కానీ యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జియో సినిమా, సోనీలివ్, ZEE5 లాంటి పాపులర్ యాప్స్ అన్నీ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉన్నాయి.

అంతేకాదు, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ కూడా ఉంది. మీ ఫోన్, లాప్‌టాప్ లేదా పీసీ నుంచి కంటెంట్‌ను డైరెక్ట్‌గా టీవీలోకి వేసుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లకు కొదవలేదు. రెండు HDMI పోర్ట్‌లు (ARC సపోర్ట్‌తో), రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ డివైజ్‌లు కనెక్ట్ చేసుకోవడానికి ఇవి చాలా యూజ్‌ఫుల్.

వైర్డ్ ఇంటర్నెట్ కోసం LAN పోర్ట్, వైర్‌లెస్ కోసం వై-ఫై, హెడ్‌ఫోన్స్ లేదా స్పీకర్ల కోసం 3.5mm ఆడియో జాక్, కేబుల్ కనెక్షన్ కోసం RF పోర్ట్, పాత డివైజ్‌ల కోసం AV IN పోర్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ టీవీ ఎక్కడ కొనుగోలు చేయవచ్చో, దీని ధర ఎంతో తెలుసుకుందాం.

* ధర

ఇన్ఫినిక్స్ 40Y1V క్యూఎల్‌ఈడీ టీవీ మార్చి 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి వస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో, ఆథరైజ్డ్ రిటైలర్ల దగ్గర దీన్ని కొనొచ్చు. ఇక ధర విషయానికొస్తే, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద కేవలం రూ.13,999 కే ఇస్తున్నారు. కానీ ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో ఇన్ఫినిక్స్ చెప్పలేదు.

అందుకే, త్వరపడండి. టీవీతో పాటు వాల్ మౌంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. బడ్జెట్‌లో అదిరిపోయే క్యూఎల్‌ఈడీ టీవీ కావాలంటే, ఇది బెస్ట్ ఆప్షన్.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix launched 40Y1V QLED 40-inch Smart TV in India with FHD+ display, 60Hz, Dolby audio, pre-installed apps at Rs. 13,999 from March 1st.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X