Infinix బ్రాండింగ్ 160W సరికొత్త అల్ట్రా ఫ్లాష్ చార్జర్!! ఛార్జింగ్ సమస్యలకు చెక్...
ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం అధికంగా ఉంది. ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. కొందరు అయితే రెండు ముందు స్మార్ట్‌ఫోన్‌లను కూడా వాడుతున్నారు. చాలా సంస్థలు తమ బ్రాండ్లతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిక్స్ సంస్థ కూడా తన యొక్క పేరుతో 2013 నుండి యూరప్ మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాండెడ్ ఫోన్‌లను విక్రయిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ భారతదేశంలో తన యొక్క స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలను పెంచుతూ మంచి విజయాన్ని సాధించింది.

ఈ కంపెనీ ఇటీవల ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రోను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ సూపర్ ఫాస్ట్ 160W ఛార్జింగ్‌తో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధం ఉన్నట్లు కొన్ని నివేదికలు చూపుతున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను అందించే ఈ సంస్థ నుంచి రాబోయే కొత్త ఫోన్ యొక్క ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ బ్రాండింగ్‌కు సంబందించిన సరికొత్త ప్రోడక్ట్ 160W "అల్ట్రా ఫ్లాష్ ఛార్జ్" కు సంబందించిన చిత్రాన్ని మేము సంపాదించగలిగాము. ప్రస్తుతం మార్కెట్‌లోని ఇతర ఆండ్రాయిడ్ పరికరాల కంటే వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతును ఇచ్చే ఫోన్‌లలో ఇన్ఫినిక్స్ సంస్థ యొక్క కొత్త ప్రోడక్ట్ ఉన్నట్లు సూచిస్తుంది. ఇప్పటివరకు వన్‌ప్లస్ 9 ప్రో ఫోన్ 65W వద్ద అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తరువాతి స్థానంలో షియోమి యొక్క Mi 11 ప్రో మరియు Mi 11 అల్ట్రా 67W ఫ్లాష్ ఛార్జ్ ను ఉపయోగిస్తున్నాయి.

ఇన్ఫినిక్స్ బ్రాండింగ్‌తో రాబోయే సరికొత్త 160W అల్ట్రా ఫ్లాష్ చార్జర్ ను సంస్థ ఏ ఫోన్ కోసం ఉద్దేశించబడింది అనే దాని గురించి ఎప్పటి వరకు ఎటువంటి వివరాలు లేవు. సరికొత్త 160W అల్ట్రా ఫ్లాష్ చార్జర్ అనేది స్మార్ట్‌ఫోన్ యొక్క ఛార్జర్ ఉంది కనిపిస్తున్నది. టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ యొక్క పెద్ద మరియు చార్జర్ అయ్యే అవకాశం లేదు కావున ఇది ఖచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన చార్జర్ మాత్రమే. ఇన్ఫినిక్స్ ఇటీవల ఈజిప్ట్, ఇండోనేషియా మరియు నైజీరియాలో తన విండోస్ ల్యాప్‌టాప్‌లను అమ్మడం ప్రారంభించింది. ప్రత్యేకమైన గ్రాఫిక్స్ కార్డులు లేని ల్యాప్‌టాప్‌లకు సాధారణంగా 160W ఛార్జింగ్ అవసరం లేదు.

ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో
ఇన్ఫినిక్స్ బ్రాండ్ ఇటీవల ఇండియాలో బడ్జెట్ ధరలో తన యొక్క ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రోని విడుదల చేసారు. ఇది మీడియాటెక్ హెలియో G95 చిప్‌సెట్, 6.95-అంగుళాల 90HZ LCD స్క్రీన్ మరియు ఆండ్రాయిడ్ 11 వంటి అద్భుతమైన ఫీచర్లతో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో యొక్క ఆప్టిక్స్ విభాగానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్ / 2.5 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో రెండు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. మరోవైపు ఇన్ఫినిక్స్ నోట్ 10 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు రెండు మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్‌లు కలిగి ఉంటాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 16 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాను ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ తో కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications