Infinix X1 సిరీస్ 40-ఇంచ్ స్మార్ట్‌టీవీ జూలైలో లాంచ్ కానున్నది!! ఫీచర్స్ ధరలు ఇవిగో

|

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఇప్పటికే రెండు స్మార్ట్ టీవీలను ప్రారంభించిన తరువాత తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి ఈ జూలైలో నెలలో 40-అంగుళాల స్క్రీన్ పరిమాణం గల పెద్ద స్మార్ట్ టీవీని ఈ నెలాఖరులోగా భారత్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది. రాబోయే ఈ స్మార్ట్ టెలివిజన్ దాని X1 స్మార్ట్ సిరీస్ విభాగంలో విడుదల కానున్నది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ

ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి రాబోయే స్మార్ట్ టీవీ 40-అంగుళాల FHD డిస్‌ప్లే మరియు సన్నని బెజెల్స్‌ నిర్మాణంను కలిగి ఉంటాయి అని అభివృద్ధికి దగ్గరగా ఉన్న ఒక నివేదిక గిజ్‌బాట్‌కు తెలిపింది. ఆండ్రాయిడ్ టీవీ సర్టిఫికేట్, హాట్‌కీలతో బ్లూటూత్ రిమోట్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్ టీవీ వినియోగదారులకు అద్భుతమైన అనుభవాలను అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

GISAT-1 Geo-ఇమేజింగ్ సాటిలైట్ లాంచ్ డేట్ ను విడుదల చేసిన ఇస్రో!!GISAT-1 Geo-ఇమేజింగ్ సాటిలైట్ లాంచ్ డేట్ ను విడుదల చేసిన ఇస్రో!!

ఇన్ఫినిక్స్ సంస్థ

ఇన్ఫినిక్స్ సంస్థ అందించే కొత్త స్మార్ట్ టీవీ యొక్క రిమోట్‌లో ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో పాటు జనాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కొరకు ప్రత్యేకమైన కీలను కలిగి ఉండవచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అదనంగా ఈ స్మార్ట్ టీవీ తేలికైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ధరకు సంబందించిన వివరాల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కానీ దీని యొక్క ధర దూకుడుగా నిర్ణయించబడుతుందని మరొక నివేదిక తెలిపింది.

Aadhaar నంబర్‌తో అనుబంధించబడిన ఫోన్ నంబర్లను తెలుసుకోవడం ఎలా??Aadhaar నంబర్‌తో అనుబంధించబడిన ఫోన్ నంబర్లను తెలుసుకోవడం ఎలా??

40 అంగుళాలు

ఇండియా యొక్క మార్కెట్ లో 40 అంగుళాల విభాగంలో ఇప్పటికే ఇతర సంస్థలు విడుదల చేసిన ధరల విషయానికి వస్తే షియోమి సంస్థ యొక్క Mi 4A హారిజన్ ఎడిషన్ 100 సెం.మీ (40 అంగుళాలు) ధర రూ. 24,999 కాగా, గూగుల్ అసిస్టెంట్ సెర్చ్, డాల్బీ ఆడియో ఫీచర్లతో లభించే ఇఫాల్కాన్ TCL100.3 సెం.మీ (40 అంగుళాల) స్మార్ట్ టీవీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,999 ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ టీవీ కూడా ఇదే పరిధిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే వాటితో భాగస్వామ్యం ఉంది.

ఇన్ఫినిక్స్ 40 అంగుళాల స్క్రీన్ టీవీ

ఇన్ఫినిక్స్ 40 అంగుళాల స్క్రీన్ టీవీ

ఇన్ఫినిక్స్ సంస్థ తన కొత్త 40 అంగుళాల స్క్రీన్ సైజు టీవీతో పాటు 50 అంగుళాల స్క్రీన్‌పరిమాణంలో గల టీవీను కూడా త్వరలోనే మెడిటెక్ ప్రాసెసర్‌లో చేర్చాలని కంపెనీ యోచిస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ సిఇఒ అనీష్ కపూర్ గిజ్‌బాట్‌కు తెలిపారు "మేము రెండు కొత్త స్క్రీన్ పరిమాణాలను జోడించాలని యోచిస్తున్నాము. ఇందులో 40 అంగుళాల మోడల్ జూలై లేదా ఆగస్టులో విడుదల చేయనున్నాము. అలాగే 55 అంగుళాల మోడల్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతాయని తెలిపారు." రాబోయే ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.20,000 విభాగంలో ఉండే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌

ఇన్ఫినిక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌

2021 క్యాలెండర్ సంవత్సరంలో మూడవ త్రైమాసికంలో ఇన్ఫినిక్స్ కంపెనీ తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ సంస్థ 2021 క్యూ 2 లోనే 5G పరికరాలను తీసుకురావాలని యోచిస్తోంది. కానీ సరఫరా పరిమితులు మరియు COVID-19 యొక్క సెకండ్ వేవ్ కారణాలు సంస్థను మరింత ఆలస్యం అవ్వడానికి కారణం అయ్యాయి. వాస్తవానికి మీడియా టెక్ ప్రాసెసర్‌తో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయాలని ఇన్ఫినిక్స్ యోచిస్తోంది. వీటి ధర రూ.15,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇంకా కంపెనీ ఈ సంవత్సరం తన నిజమైన వైర్‌లెస్ పరిధిలో మరిన్ని ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Infinix Company Plan To Launch 40-Inch Smart TV Under X1 Series In July

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X