Home
News

Infinix Zero 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్, ఇండియా లాంచ్ వివరాలు ఇవిగో

ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ తన యొక్క మొట్ట మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌గా ఇన్ఫినిక్స్ జీరో 5G ను ప్రారంభించింది. ఇన్ఫినిక్స్ యొక్క ఈ తాజా ఫోన్ మూడు విభిన్న కలర్ ఎంపికలలో వస్తుంది. ఇది 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉండి మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మరియు హోల్-పంచ్ డిజైన్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ ఫీచర్లతో ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ జీరో 5G ధరలు & ఇండియా లాంచ్ డేట్

ఇన్ఫినిక్స్ జీరో 5G ధరలు & ఇండియా లాంచ్ డేట్

ఇన్ఫినిక్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ కొత్త ఇన్ఫినిక్స్ జీరో 5G ఫోన్ యొక్క ధర మరియు లభ్యత వివరాలను ప్రస్తావించలేదు. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం నైజీరియన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ngspark.comలో NGN 169,500 (దాదాపు రూ.30,400) ధర వద్ద జాబితా చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో కాస్మిక్ బ్లాక్, హారిజన్ బ్లూ మరియు స్కైలైట్ ఆరెంజ్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇన్ఫినిక్స్ జీరో 5G ఫోన్ ఇండియాలో ఫిబ్రవరి 14న లాంచ్ కానున్నది. రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం మైక్రోసైట్ Flipkartలో లైవ్ ప్రసారం చేయబడుతోంది. ఇది ఫోన్ యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది.

ఇన్ఫినిక్స్ జీరో 5G స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ జీరో 5G స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ జీరో 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్11 ఆధారిత XOS 10పై నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ IPS LTPS (1,080x2,460 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద మీడియా టెక్ డైమెన్సిటీ 900 SoCని కలిగి ఉండి 8GB LPDDR5 RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది.

కెమెరా యూనిట్‌

ఇన్ఫినిక్స్ జీరో 5G ఫోన్ యొక్క విషయానికి వస్తే వెనుక విభాగంలో క్వాడ్ రియర్ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 30X జూమ్ సామర్థ్యంతో 48-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో అందించబడింది. కెమెరా సెటప్‌లో 13-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ షూటర్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను డ్యూయల్ ఫ్రంట్ ఫ్లాష్‌తో అందించింది. వెనుక కెమెరా సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ జీరో 5G ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, FM రేడియో, Wi-Fi 6, బ్లూటూత్, GPS, OTG, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో లైట్ సెన్సార్, బేరోమీటర్, గైరోస్కోప్, g-సెన్సార్, ఇ-కంపాస్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ప్రామాణీకరణ కోసం, కొత్త Infinix హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ గరిష్టంగా 22 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని మరియు 27 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Infinix Company’s First 5G Powered Smartphone Launched: Price, Specs, India Launch Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X