Home
News

నథింగ్ ఫోన్ 2 కు, అప్పుడే, కాపీ వచ్చేసింది! ఈ కొత్త ఫోన్ వివరాలు

By Maheswara

ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారతదేశం మరియు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముందే, స్పెసిఫికేషన్‌లు మరియు డిజైన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీక్ అయిన వివరాల ప్రకారం ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో వస్తుందని చెప్పబడింది.

ఇక్కడ మనము రెండు కొత్త 5G ఫోన్‌లను చూడవచ్చు మరియు వాటిలో ఒకటి ఇన్ఫినిక్స్ GT 10 ప్రో వేరియంట్. రెండోది భారీ 7,000mAh బ్యాటరీ, 256GB స్టోరేజీ మరియు ఇతర ఫీచర్లతో వస్తుందని చెప్పబడింది. ఇప్పటివరకు లీక్ అయిన ప్రతి విషయం ఇక్కడ ఉంది మరియు ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ ఎప్పుడు వస్తుంది అనే వివరాలు కూడా ఇక్కడ తెలుసుకోండి.

Infinix GT 10 Pro Expected To Launch 7000mAh Battery, 260W Fast Charging And 256GB Storage And More Details Here.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయిన వివరాలు
ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ రాబోయే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో స్మార్ట్‌ఫోన్ వివరాలను లీక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ కొత్త 5G ఫోన్‌ను 256GB స్టోరేజ్ మరియు 24GB RAMతో సున్నితంగా మరియు మరింత సమర్థవంతమైన పనితీరుతో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్ ఉండవచ్చు.

టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, ఇన్ఫినిక్స్ GT 10 ప్రో యొక్క అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి దాని 7,000mAh బ్యాటరీ. మరియు ఇన్ఫినిక్స్ 160W లేదా 260W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్ట్‌ను అందించగలదు. ఈ అత్యాధునిక టెక్నాలజీ ని మొదటిసారిగా ఇన్ఫినిక్స్ మార్చిలో లాంచ్ చేసింది. ఈ విషయంలో GT 10 ప్రో ను గొప్ప పరికరంగా మార్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz అమోలెడ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ విషయంలో వివరాలు గమనిస్తే, ఈ పరికరం 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉండవచ్చు. ఇది రెండు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ల ను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ GT 10 ప్రో డిజైన్ నథింగ్ ఫోన్ (2)ని పోలి ఉందా? వివరాలు తెలుసుకోండి
ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ డిజైన్ నథింగ్ ఫోన్ (2) డిజైన్ కు అద్భుతమైన పోలికను కలిగి ఉన్నట్లు చూపించింది. ఇది వెనుకవైపు LED లైట్లతో కూడిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లాంటి డిజైన్‌ను కలిగి ఉండవచ్చు. కానీ, ఈ టీజర్ ఇమేజ్ LED లైట్లు వెలుగుతున్న బ్యాక్ ప్యానెల్‌ను చూపించలేదు. ఈ ఫోన్ రెండు రంగుల ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుందని నివేదించబడింది. అవి, నలుపుతో పాటు నారింజ పట్టీలు మరియు తెలుపు బూడిద రంగులతో కలిపి ఉంటాయి.

ఇన్ఫినిక్స్ GT 10 ప్రో భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది? వివరాలు
ఇన్ఫినిక్స్ GT 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సంస్థ భావిస్తున్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. అయితే లీక్‌ల ప్రకారం, వచ్చే మరో రెండు నెలల్లో ఇండియా లో లాంచ్ ను షెడ్యూల్ చేయడంతో భారతీయ వినియోగదారులు మరి కొంచెం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడప్పుడే, ఇన్ఫినిక్స్ GT 10 ప్రో+ భారత మార్కెట్లోకి రాకపోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix GT 10 Pro Expected To Launch 7000mAh Battery, 260W Fast Charging And 256GB Storage And More Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X