Home
News

108MP కెమెరా, 8GB ర్యామ్‌తో కొత్త ఫోన్‌.. నథింగ్‌ ఫోన్‌ తరహా డిజైన్.. !!

ఇన్‌ఫినిక్స్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Infinix GT 10 Pro స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. నథింగ్‌ ఫోన్‌ తరహాలో సెమీ ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఫోన్‌వైపు LED లైట్లకు బదులుగా కెమెరా మాడ్యూల్‌ వద్ద చిన్న చిన్న స్ట్రిప్‌ లైట్లు ఉన్నాయి. ఈ లైట్లను కేవలం డిజైన్‌ను మెరుగుపరిచేందుకు మాత్రమే వినియోగించారు.

ఇన్‌ఫినిక్స్‌ జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ గేమర్స్‌ను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఫోన్‌ సైబర్‌ బ్లాక్‌, మిరాజ్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్లు UV కాంతికి గురైనప్పుడు సైబర్‌ బ్లాక్‌ మోడల్‌ ఫోన్‌ బ్రైట్‌ ఆరేంజ్, మిరాజ్‌ సిల్వర్‌ రంగు ఫోన్ స్టీల్‌ బ్లూ, డస్టీ పింక్‌ రంగుల్లోకి మారుతుంది.

Infinix GT 10 Pro smartphone launched in India

ఇన్‌ఫినిక్స్‌ GT 10 Pro స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999కు కొనుగోలు చేయవచ్చు. ఇన్‌ఫినిక్స్‌ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్టు వినియోగదారులు ఆఫర్‌లతోపాటు నో కాస్ట్‌ EMI ద్వారా కూడా తగ్గింపు ధరను పొందవచ్చు.

ఇన్‌ఫినిక్స్‌ GT 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2460 పిక్సల్‌, 360 టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 387 ppiతో రానుంది. గేమింగ్‌, కంటెంట్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ స్క్రీన్‌ సూపర్‌ స్లిమ్‌ బెజెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 93 శాతం స్ర్కీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంటుందని ఇన్‌ఫినిక్స్‌ సంస్థ తెలిపింది.

Infinix GT 10 Pro smartphone launched in India

ఈ ఫోన్‌ వెనుకవైపు 108MP ప్రధాన కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. ముందు వైపు పంచ్‌హోల్ డిస్‌ప్లేలో 32MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ v13 ఆధారంగా పనిచేస్తుంది. మరియు 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

ఈ ఫోన్‌ 5G సహా ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్‌ బ్యాండ్‌ WiFi, గేమ్‌ప్యాడ్‌లను కనెక్ట్ చేసుకొనేందుకు USB OTG సపోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉందని తెలిపింది.

గేమింగ్‌ సమయంలో మంచి మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుందని ఇన్‌ఫినిక్స్ సంస్థ చెబుతోంది. గేమర్స్‌లకు ఈ ఫోన్‌ కచ్చితంగా ఆకట్టుకుంటుందని భావిస్తోంది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని ఇన్‌ఫినిక్స్ సంస్థ వెల్లడించింది. ప్రీ బుక్‌ చేసుకున్న తొలి 1000 మందికి రూ.2000 డిస్కౌంట్‌ వస్తుందని తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix GT 10 Pro smartphone launched in india semi transparent design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X