Home
News

108MP కెమెరా తో Infinix GT 20 Pro లాంచ్ అయింది ! ధర, స్పెసిఫికేషన్లు

ఇన్ఫినిక్స్‌ సంస్థ కొత్త Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్‌ను సౌదీ అరేబియా లో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్‌లో X5 టర్బో గేమింగ్ డిస్‌ప్లే చిప్, 108MP కెమెరా, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లను ఇక్కడ చూడండి.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్‌ల వివరాలు: ఇది 6.78-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, ఈ ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2304Hz PWM డిమ్మింగ్, పిక్సెల్‌వర్క్స్ X5 టర్బో గేమింగ్ డిస్‌ప్లే చిప్ వంటి వివిధ డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.

Infinix GT 20 Pro With 108MP Camera 12GB RAM And 6 78 inch Display Launched

అద్భుతమైన ఈ ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్, 3.1GHz ఆక్టా-కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 5G 4nm ప్రాసెసర్‌తో లాంచ్ చేయబడింది. ఇది గేమింగ్ వినియోగదారులను ఆకర్షించడానికి ఈ ఫోన్ Mali-G610 MC6 GPU కి కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి గేమింగ్ వినియోగదారులు ఈ ఫోన్‌ను విశ్వసించి కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజీ మరియు 12GB RAM + 256GB స్టోరేజీ లో వస్తుంది. అదనంగా, ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ విస్తరణకు మద్దతును కలిగి ఉంది. అంటే మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ ను కలిగి ఉంది.

ఈ ఇన్ఫినిక్స్‌ GT 20 Pro స్మార్ట్‌ఫోన్‌లో 108MP శాంసంగ్ HM6 సెన్సార్ + 2MP మాక్రో లెన్స్ + 2MP డెప్త్ సెన్సార్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఖచ్చితమైన ఫోటోలు మరియు వీడియోలను తీసుకోవచ్చు.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 32MP కెమెరాతో కూడా వస్తుంది. ఈ కొత్త ఇన్ఫినిక్స్‌ ఫోన్ HiOS 14-ఆధారిత Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్ ఉంది. అలాగే, ఈ ఫోన్‌లో ఐఆర్ బ్లాస్టర్, USB టైప్-సి ఆడియో, స్టీరియో డ్యూయల్ స్పీకర్, జెబిఎల్ సౌండ్ వంటి వివిధ ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో ప్రత్యేకించి గొప్ప ఆడియో అనుభూతిని అందిస్తుంది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో విడుదల చేయబడింది. కాబట్టి ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ కొద్ది నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC సహా వివిధ కనెక్టివిటీ మద్దతు ఉంది. ఈ ఫోన్‌ను మేచ బ్లూ, మేచ ఆరంజ్ మరియు మేచ సిల్వర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చని కూడా గమనించాలి.

ప్రస్తుతం ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో ఫోన్ సౌదీ అరేబియాలో మాత్రమే లాంచ్ చేయబడింది. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత్‌తో పాటు అన్ని దేశాల్లోనూ విడుదల చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా, Infinix GT 20 Pro ప్రారంభ ధర SAR 1,299 (భారత కరెన్సీలో రూ. 28,885). ఈ ఫోన్ సౌదీ అరేబియాలో మే 1 నుంచి సేల్ కి రానుంది.

Best Mobiles in India

English summary
Infinix GT 20 Pro With 108MP Camera,12GB RAM And 6.78 inch Display Launched. Price,Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X