Infinix Hot 10 4GB RAM కొత్త వేరియంట్ లాంచ్!!! ధర కూడా తక్కువే...

|

ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ కొత్త వేరియంట్ ఇండియాలో విడుదల అయింది. ఈ వేరియంట్ యొక్క అమ్మకాలు అక్టోబర్ 29 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా మొదలుకానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వంటి ఒకే ఒక వేరియంట్‌లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది మరొక కొత్త వేరియంట్‌లో లభిస్తుంది. 5,200mAh బ్యాటరీ, మీడియాటెక్ హెలియో G70 SoC మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్లను కలిగిన ఇన్ఫినిక్స్ హాట్ 10 కొత్త వేరియంట్ అదే అంబర్ రెడ్, మూన్లైట్ జాడ్, అబ్సిడియన్ బ్లాక్ మరియు ఓషన్ వేవ్ వంటి నాలుగు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10 ధరలు & లాంచ్ సేల్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10 ధరలు & లాంచ్ సేల్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4GB ర్యామ్ + 64GM స్టోరేజ్ కొత్త కాన్ఫిగరేషన్ మోడల్ రూ.8,999 ధర వద్ద అంబర్ రెడ్, మూన్లైట్ జాడే, అబ్సిడియన్ బ్లాక్ మరియు ఓషన్ వేవ్ వంటి నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అక్టోబర్ 29 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభించే ఈ ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే కోటక్ డెబిట్ / క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు, HSBC క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆఫ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

 

Also Read: Netflix ను 48 గంటల పాటు ఉచితంగా యాక్సిస్ చేసే గొప్ప అవకాశం...Also Read: Netflix ను 48 గంటల పాటు ఉచితంగా యాక్సిస్ చేసే గొప్ప అవకాశం...

ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 6.78-అంగుళాల HD + ఐపిఎస్ డిస్ప్లే 720x1,640 పిక్సెల్స్ పరిమాణంలో, 20.5: 9 కారక నిష్పత్తి మరియు 480 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G70 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో XOS 7 మద్దతుతో రన్ అవుతూ ARM మాలి- G52 GPUతో జత చేయబడి ఉంటుంది. ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.85 లెన్స్ తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10 కనెక్టివిటీ ఫీచర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10 కనెక్టివిటీ ఫీచర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో కూడిన 5,200mAh అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై 802.11 ఎ / బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. చివరగా ఈ ఫోన్ 171.1x77.6x8.88mm కొలతల పరిమాణంతో 204 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Infinix Hot 10 Smartphone 4GB RAM, 64GB Storage New Variant Released in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X