ఇన్ఫినిక్స్ హాట్ 10s మొదటి సేల్ లో ఊహించని ఆఫర్లు!! మిస్ అవ్వకండి..

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ గత వారం ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ ను నేడు మొదటి సారిగా కొనుగోలు చేయడం కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నది. 6,000mAh బ్యాటరీ, మీడియాటెక్ హెలో G85 SoC చేత శక్తిని పొందుతూ ఆండ్రాయిడ్ 11 ఆధారిత XOS 7.6 లో రన్ అయ్యే ఈ ఫోన్ వెనుక భాగంలో డైమండ్ ఆకృతిలో రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ హాట్ 10s ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 10s ధరల వివరాలు

భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర రూ.9,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర 10,999 రూపాయలు. ఇది పర్పుల్, హార్ట్ ఆఫ్ ఓషన్, మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10s సేల్స్ వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 10s సేల్స్ వివరాలు

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యే ఇన్ఫినిక్స్ హాట్ 10s మొదటి అమ్మకంలో భాగంగా వినియోగదారులకు రూ.500 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ కార్డుల మీద 5% వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే బ్యాంక్ అఫ్ బరోడా యొక్క మొదటి కొనుగోలు మీద 10% వరకు తగ్గింపును లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ యొక్క సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11-బేస్డ్ XOS 7.6 పై రన్ అవుతుంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌లను కలిగి ఉంటుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్, 180HZ టచ్ శాంప్లింగ్ రేట్ తో, 20.5: 9 కారక నిష్పత్తి, 440 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1500: 2 కాంట్రాస్ట్ రేషియో, 720x1,640 పిక్సెల్స్ మరియు 90.66 శాతం స్క్రీన్‌తో 6.82-అంగుళాల హెచ్‌డి + IPS -LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G85 ఆక్టా-కోర్ Soc ను కలిగి ఉండి 6GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటుగా 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ లెన్స్ మరియు మరొక AI లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, హెచ్‌డిఆర్, పోర్ట్రెయిట్ హెచ్‌డిఆర్ వంటి మరిన్ని ఫీచర్లతో లభిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా మోడ్లలో సూపర్ నైట్, AI పోర్ట్రెయిట్, AI 3 డి ఫేస్ బ్యూటీ, వైడ్ సెల్ఫీ మరియు AR షాట్స్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Infinix Hot 10S First Sale Starts Today in India Via Flipkart: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X