Home
News

Infinix Hot 10S స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!! 10వేలు లోపు ధరలో గొప్ప ఫీచర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ ఇండోనేషియాలో గత నెలలో లాంచ్ అయిన తర్వాత నేడు కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s ఫోన్ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి మీడియాటెక్ హెలో G85 SoC చేత శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత XOS 7.6 లో రన్ అవుతూ వెనుక భాగంలో డైమండ్ ఆకృతి నమూనాలో రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. అలాగే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్ తో 90HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ హాట్ 10s ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 10s ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర రూ. 9,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర 10,999 రూపాయలు. ఇది మొరాండి పర్పుల్, 7-డిగ్రీ పర్పుల్, హార్ట్ ఆఫ్ ఓషన్, మరియు 95-డిగ్రీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో ఈ ఫోన్ యొక్క అమ్మకాలు మే 27 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ మొదటి అమ్మకం సమయంలో వినియోగదారులకు రూ.500 తగ్గింపు లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ యొక్క సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11-బేస్డ్ XOS 7.6 పై రన్ అవుతుంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌లను కలిగి ఉంటుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్, 180HZ టచ్ శాంప్లింగ్ రేట్ తో, 20.5: 9 కారక నిష్పత్తి, 440 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1500: 2 కాంట్రాస్ట్ రేషియో, 720x1,640 పిక్సెల్స్ మరియు 90.66 శాతం స్క్రీన్‌తో 6.82-అంగుళాల హెచ్‌డి + IPS -LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G85 ఆక్టా-కోర్ Soc ను కలిగి ఉండి 6GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10s

ఇన్ఫినిక్స్ హాట్ 10s స్మార్ట్‌ఫోన్‌ ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటుగా 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ లెన్స్ మరియు మరొక AI లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, హెచ్‌డిఆర్, పోర్ట్రెయిట్ హెచ్‌డిఆర్ వంటి మరిన్ని ఫీచర్లతో లభిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా మోడ్లలో సూపర్ నైట్, AI పోర్ట్రెయిట్, AI 3 డి ఫేస్ బ్యూటీ, వైడ్ సెల్ఫీ మరియు AR షాట్స్ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 10S Released in India With MediaTek Helio G85 SoC: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X