ఇన్ఫినిక్స్ హాట్ 11&11S బడ్జెట్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ఫీచర్స్ ఇవిగో...

|

ఇన్‌ఫినిక్స్ హాట్ 11 సిరీస్ లైనప్‌ స్మార్ట్‌ఫోన్‌లలో మొదటి సమర్పణలు అయిన ఇన్ఫినిక్స్ హాట్ 11 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 11S నేడు భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ రెండు Infinix స్మార్ట్‌ఫోన్‌లు 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తాయి కానీ హుడ్ కింద వేర్వేరు ప్రాసెసర్‌లను పొందుతాయి. ఇన్‌ఫినిక్స్ హాట్ 11 నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుండగా, ఇన్ఫినిక్స్ హాట్ 11s మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 11. XOS 7.6 స్కిన్‌తో రన్ అవుతూ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇన్ఫినిక్స్ హాట్ 11 &  11S ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 11 & 11S ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫోన్ యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.8,999 కాగా Infinix Hot 11S యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇన్‌ఫినిక్స్ హాట్ 11 ఇన్ 7 డిగ్రీల పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్, పోలార్ బ్లాక్ మరియు సిల్వర్ వేవ్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. మరోవైపు ఇన్ఫినిక్స్ హాట్ 11S పర్పుల్, గ్రీన్ వేవ్ మరియు పోలార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 11S సెప్టెంబర్ 21 న విక్రయించబడుతుండగా, వనిల్లా ఇన్ఫినిక్స్ హాట్ 11 యొక్క విక్రయ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. రెండు స్మార్ట్‌ఫోన్‌ల హ్యాండ్‌సెట్‌పై ఒక సంవత్సరం వారంటీ మరియు యాక్సెసరీలపై 6 నెలల వారంటీతో అందించబడతాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 11 స్పెసిఫికేషన్స్
 

ఇన్ఫినిక్స్ హాట్ 11 స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 11 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై XOS 7.6 స్కిన్‌తో పనిచేస్తుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,408 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. హుడ్ కిం ఇది 4GB LPDDR4 ర్యామ్‌తో జత చేయబడి మీడియాటెక్ హీలియో G70 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉండి ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్ మరియు క్వాడ్-LED ఫ్లాష్‌తో డ్యూయల్ 13 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే f/2.0 ఎపర్చరు లెన్స్ మరియు డ్యూయల్-LED ఫ్లాష్‌తో 8 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్‌ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 11s స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 11s స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 11s యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11-ఆధారిత XOS 7.6 స్కిన్‌తో రన్ అవుతుంది. ఇది 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,480 పిక్సెల్స్) ఎల్‌టిపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.5: 9 యాస్పెక్ట్ రేషియో మరియు ఎన్‌ఇజి డైనోరెక్స్ T2X-1 గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద ఇది 4GB LPDDR4 ర్యామ్‌తో MediaTek Helio G88 SoC తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో f/1.6 ఎపర్చరు లెన్స్ తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్‌తో AI- పవర్డ్ లెన్స్ లు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం డ్యూయల్-LED ఫ్లాష్‌తో 8 మెగాపిక్సెల్ AI ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi, 4G LTE, బ్లూటూత్ v5, USB టైప్-సి మరియు USB OTG ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో వెనుకవైపు అమర్చబడిన వేలిముద్ర స్కానర్, యాంబియంట్ లైట్ సెన్సార్, G- సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ మరియు E- కంపాస్ ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Infinix Hot 11, Infinix Hot 11S Released in India: Price, Specs, Sale Date, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X