ఇన్ఫినిక్స్ హాట్ 11S బడ్జెట్ ఫోన్ మొదటి సేల్ మొదలయ్యాయి!! క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అనేకం
ఇండియాలో ఇటీవల ఇన్‌ఫినిక్స్ హాట్ 11 సిరీస్ లైనప్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా ఇన్ఫినిక్స్ హాట్ 11 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 11S లను విడుదల చేసింది. 4GB RAM + 64GB స్టోరేజ్ ఒకే ఒక కాన్ఫిగరేషన్‌లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్ఫినిక్స్ హాట్ 11S మోడల్ నేడు మొదటి సారి అమ్మకానికి రానున్నది. ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12PM నుంచి దీని యొక్క అమ్మకాలు మొదలుకానున్నాయి. ఆండ్రాయిడ్ 11. XOS 7.6 స్కిన్‌తో రన్ అవుతూ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఫీచర్లతో పాటుగా హుడ్ కింద మీడియాటెక్ హీలియో G88 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతూ మూడు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ హాట్ 11S ధరల వివరాలు
ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 11S కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ వద్ద లభించే ఈ మోడల్ యొక్క ధర రూ.10,999. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో SBI కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డుపై 5%, బ్యాంక్ అఫ్ బరోడా మాస్టర్ కార్డు యొక్క మొదటి కొనుగోలుపై 10% తగ్గింపు లభిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11S ఫోన్ పర్పుల్, గ్రీన్ వేవ్ మరియు పోలార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హ్యాండ్‌సెట్‌పై ఒక సంవత్సరం వారంటీ మరియు యాక్సెసరీలపై 6 నెలల వారంటీతో అందించబడతాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 11s స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ హాట్ 11s యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11-ఆధారిత XOS 7.6 స్కిన్‌తో రన్ అవుతుంది. ఇది 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,480 పిక్సెల్స్) ఎల్‌టిపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.5: 9 యాస్పెక్ట్ రేషియో మరియు ఎన్‌ఇజి డైనోరెక్స్ T2X-1 గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద ఇది 4GB LPDDR4 ర్యామ్‌తో MediaTek Helio G88 SoC తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 11s యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో f/1.6 ఎపర్చరు లెన్స్ తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్‌తో AI- పవర్డ్ లెన్స్ లు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం డ్యూయల్-LED ఫ్లాష్‌తో 8 మెగాపిక్సెల్ AI ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi, 4G LTE, బ్లూటూత్ v5, USB టైప్-సి మరియు USB OTG ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో వెనుకవైపు అమర్చబడిన వేలిముద్ర స్కానర్, యాంబియంట్ లైట్ సెన్సార్, G- సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ మరియు E- కంపాస్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications