ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే బడ్జెట్ ఫోన్ మొదటి సేల్స్ ప్రారంభంకానున్నాయి!! ఆఫర్స్ మిస్ అవ్వకండి...

|

ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ గత వారం ఇండియాలో 6,000mAh అతిపెద్ద బ్యాటరీ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నవంబర్‌లో ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 11 ప్లే ఫోన్ కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా విడుదలైన ఈ ఫోన్ పంచ్- హోల్ డిస్ప్లే డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 6,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది Unisoc T610 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 4GB RAMతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ధరలు & సేల్స్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ధరలు & సేల్స్ ఆఫర్స్

భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.8,499 ధర వద్ద షాంపైన్ గోల్డ్, డేలైట్ గ్రీన్, హారిజన్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12PM గంటల నుంచి ప్రారంభమయ్యే మొదటి సేల్స్ లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో పాటుగా స్పెషల్ ఆఫర్లో భాగంగా రూ.3,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్పెసిఫికేషన్స్
 

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11లో XOS 10తో రన్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.82-అంగుళాల ఫుల్-HD+ (1,640x720 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 90.66 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. అదనంగా ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ UniSoc T610 SoCతో రన్ అవుతూ 4GB RAMతో ప్యాక్ చేయబడి వస్తుంది. అదనపు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించి RAMని 3GB వరకు పొడిగించుకోవడానికి అనుమతిని కూడా ఇస్తుంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ భాగంలో క్వాడ్-LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్ మరియు డెప్త్ సెన్సార్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ముందు భాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను డ్యూయల్-LED ఫ్లాష్‌తో లభిస్తుంది. అలాగే ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా 256GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, WCDMA, GSM, Wi-Fi 02.11 a/b/g/n, బ్లూటూత్ v5 మరియు GPS/ A-GPS ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, g-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 10W స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Infinix Hot 12 Play Budget Smartphone First Sales Starts Today at 12PM via Flipkart: Price, Specifications, Discount offers and Deals

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X