Home
News

6,000mAh బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే కొత్త ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

చైనా యొక్క ట్రాన్స్‌షన్ గ్రూప్ యాజమాన్యంలోని ఇన్ఫినిక్స్ బ్రాండ్ నేడు ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ గత ఏడాది నవంబర్‌లో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 11 ప్లే ఫోన్ కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా వస్తున్నది. ఇది పంచ్- హోల్ డిస్ప్లే డిజైన్, 13-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 6,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్ల కలయికతో వస్తుంది. అలాగే ఇది Unisoc T610 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 4GB RAMతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ధరల వివరాలు

భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఏకైక వేరియంట్ యొక్క ధర రూ.8,499. ఈ స్మార్ట్‌ఫోన్ షాంపైన్ గోల్డ్, డేలైట్ గ్రీన్, హారిజన్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ మే 30 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటిసారి విక్రయించడానికి అందుబాటులోకి రానున్నది.

 

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11లో XOS 10తో రన్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.82-అంగుళాల ఫుల్-HD+ (1,640x720 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 90.66 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. అదనంగా ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ UniSoc T610 SoCతో రన్ అవుతూ 4GB RAMతో ప్యాక్ చేయబడి వస్తుంది. అదనపు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించి RAMని 3GB వరకు పొడిగించుకోవడానికి అనుమతిని కూడా ఇస్తుంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ భాగంలో క్వాడ్-LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్ మరియు డెప్త్ సెన్సార్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ముందు భాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను డ్యూయల్-LED ఫ్లాష్‌తో లభిస్తుంది. అలాగే ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా 256GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, WCDMA, GSM, Wi-Fi 02.11 a/b/g/n, బ్లూటూత్ v5 మరియు GPS/ A-GPS ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, g-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 10W స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 12 Play New Budget Smartphone Released in India With Octa-Core UniSoc T610 SoC: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X