Home
News

Infinix Hot 9 Pro Sale: గొప్ప ఆఫర్లతో అమ్మకానికి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్....

ఇండియాలో ఈ మధ్య కాలంలో బడ్జెట్ ధరలో విడుదల అయిన స్మార్ట్ ఫోన్ లలో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఒకటి. ఈ రోజు ఈ ఫోన్ యొక్క అమ్మకాలు మొదలయ్యాయి. మే చివరలో షియోమి మరియు రియల్ మి బడ్జెట్ ఫోన్లకు ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫినిక్స్ సంస్థ తన రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ యొక్క అమ్మకాలు ఇటీవల జరిగాయి. ఈ రోజు మొదటిసారిగా ప్రో వేరియంట్ యొక్క అమ్మకాలు మొదలయ్యాయి. స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కూడా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరియు సేల్స్ ఆఫర్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ధరల వివరాలు

ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒకే ఒక వేరియంట్లో విడుదల చేసారు. 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ లో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.9,999. ఈ ఫోన్ వైలెట్ మరియు ఓషన్ వేవ్ కలర్ ఎంపికలో లభిస్తుంది.

 

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్స్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్స్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి మొదలయ్యాయి. దీనిని కొనుగోలు చేయడానికి వినియోగదారులకు నో-కాస్ట్ EMI ఎంపికలో నెలకు రూ.834 వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద 6 నెలల యూట్యూబ్ ప్రీమియం ఉచిత ట్రయల్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు కూడా అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్‌ (నానో) మద్దతుతో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 10-ఆధారిత XOS 6.0 ద్వారా రన్ అవుతాయి. ఈ ఫోన్‌ 720x1600 పిక్సెల్స్ పరిమాణంలో 6.6-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ LCD IPS డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తి, 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియో, మరియు 480 నిట్స్ ప్రకాశంతో వస్తాయి. IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAM తో జత చేసిన 2.0GH హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో ఇవి పనిచేస్తాయి. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB వద్ద ఉన్నాయి. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తాయి. ఈ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపు ఎగువ మూలలో నిలువుగా సమలేఖనం పద్దతిలో అమర్చబడి ఉంటాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇవి తక్కువ లైట్ సెన్సార్లను కూడా కలిగి ఉన్నాయి. ఇందులో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది. కెమెరా యొక్క ఫీచర్లలో కస్టమ్ బోకె, AI HDR మరియు AI 3D బ్యూటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో  సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో యొక్క ఫోన్‌లో ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు ఎల్‌ఇడి ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు కెమెరా స్క్రీన్ యొక్క ఎడమవైపు ఎగువ భాగంలో గల పంచ్-హోల్ లోపల ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మోడ్లలో AI పోర్ట్రెయిట్, AI 3D ఫేస్ బ్యూటీ, వైడ్-సెల్ఫీ మరియు AR అనిమోజీ ఉన్నాయి. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది ఒక ఛార్జ్ మీద 30 గంటల టాక్‌టైమ్, 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్ మరియు 19 రోజుల స్టాండ్‌బై సమయం వరకు వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఫోన్ యొక్క వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్రంట్ ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది బ్లూటూత్ V5, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, USB OTG, వోవైఫై మరియు మైక్రో యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. బోర్డులో సెన్సార్లలో జి-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, సామీప్య సెనర్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్లు DTS సరౌండ్ సౌండ్‌కు మద్దతు ఇస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 9 Pro Sales Live on Flipkart: Price, Specs, Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X