Home
News

అద్భుతమైన ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ లో మొదలైన Infinix Hot 9 Pro సేల్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో బడ్జెక్ట్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలు ఇండియాలో ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు కొనుగోలుదారులకు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికల ద్వారా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇనిఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్స్

ఇనిఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్స్

ఇనిఫినిక్స్ హాట్ 9 ప్రో యొక్క ముఖ్యమైన ఫీచర్లలో పంచ్-హోల్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో P22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటివి ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కూడా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరియు సేల్స్ ఆఫర్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ధరల వివరాలు

ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒకే ఒక వేరియంట్లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ లో లభించే ఈ ఫోన్ యొక్క ధర కేవలం రూ.9,999. ఈ ఫోన్ వైలెట్ మరియు ఓషన్ వేవ్ కలర్ ఎంపికలో లభిస్తుంది.

 

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్స్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో సేల్స్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు జరగనున్నాయి. దీనిని కొనుగోలు చేయడానికి వినియోగదారులకు నో-కాస్ట్ EMI ఎంపికలో నెలకు రూ.834 వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద 6 నెలల యూట్యూబ్ ప్రీమియం ఉచిత ట్రయల్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు కూడా అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్‌ (నానో) మద్దతుతో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 10-ఆధారిత XOS 6.0 ద్వారా రన్ అవుతాయి. ఈ ఫోన్‌ 720x1600 పిక్సెల్స్ పరిమాణంలో 6.6-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ LCD IPS డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తి, 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియో, మరియు 480 నిట్స్ ప్రకాశంతో వస్తాయి. IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAM తో జత చేసిన 2.0GH హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో ఇవి పనిచేస్తాయి. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB వద్ద ఉన్నాయి. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తాయి. ఈ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపు ఎగువ మూలలో నిలువుగా సమలేఖనం పద్దతిలో అమర్చబడి ఉంటాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇవి తక్కువ లైట్ సెన్సార్లను కూడా కలిగి ఉన్నాయి. ఇందులో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది. కెమెరా యొక్క ఫీచర్లలో కస్టమ్ బోకె, AI HDR మరియు AI 3D బ్యూటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో AI సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో AI సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో యొక్క ఫోన్‌లో ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు ఎల్‌ఇడి ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు కెమెరా స్క్రీన్ యొక్క ఎడమవైపు ఎగువ భాగంలో గల పంచ్-హోల్ లోపల ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మోడ్లలో AI పోర్ట్రెయిట్, AI 3D ఫేస్ బ్యూటీ, వైడ్-సెల్ఫీ మరియు AR అనిమోజీ ఉన్నాయి. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది ఒక ఛార్జ్ మీద 30 గంటల టాక్‌టైమ్, 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్ మరియు 19 రోజుల స్టాండ్‌బై సమయం వరకు వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 9 Pro Sales Live on Flipkart With More Discount Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X