ఇన్ఫినిక్స్ నోట్ 10 & 10 ప్రో ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! అందుబాటు ధరలోనే...

|

ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మరియు ఇన్ఫినిక్స్ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లు రెండు నేడు భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. గేమింగ్-ఫోకస్డ్ ప్రాసెసర్లు మరియు మల్టీ-రియర్ కెమెరా సెటప్‌ ఫీచర్లను ఈ సరసమైన స్మార్ట్‌ఫోన్‌లతో అందిస్తున్నారు. ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్ చేత శక్తినివ్వగా, ఇన్ఫినిక్స్ నోట్ 10 హెలియో G85 ప్రాసెసర్ మద్దతుతో లభిస్తుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్‌తో పాటుగా 5,000mAh బ్యాటరీలతో ప్యాక్ చేయబడి ఉండే ఈ ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతదేశంలో ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో ఫోన్ ఒకే ఒక మోడల్ లో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 16,999 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని జూన్ 13 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 7 డిగ్రీ పర్పుల్, 95 డిగ్రీ బ్లాక్, మరియు నార్డిక్ సీక్రెట్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 

Huawei HarmonyOS వచ్చేసింది!! గూగుల్, ఆపిల్‌లకు ముప్పు వచ్చేనా?Huawei HarmonyOS వచ్చేసింది!! గూగుల్, ఆపిల్‌లకు ముప్పు వచ్చేనా?

మరోవైపు ఇన్ఫినిక్స్ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ లలో విడుదలైంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.10,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 11,999 రూపాయలు. ఈ ఫోన్ కూడా జూన్ 13 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబడుతుంది. ఇది 7 డిగ్రీ పర్పుల్, 95 డిగ్రీ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 10 సిరీస్ స్పెసిఫికేషన్స్
 

ఇన్ఫినిక్స్ నోట్ 10 సిరీస్ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేసిన రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మరియు ఇన్ఫినిక్స్ నోట్ 10 రెండూ కూడా ఆండ్రాయిడ్ 11 ఆధారిత XOS 7.6 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతాయి. అలాగే రెండు ఫోన్‌లలో 6.95-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే 180HZ టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రోలో 90HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండగా నోట్ 10 మోడల్ లో 60HZ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్‌లలో సినిమాటిక్ డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.

మీడియాటెక్ హెలియో

ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మీడియాటెక్ హెలియో G95 SoC చేత శక్తినివ్వగా, ఇన్ఫినిక్స్ నోట్ 10 మాత్రం హెలియో G85 ప్రాసెసర్ మద్దతుతో లభిస్తుంది. అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో 8GB ర్యామ్ తో ప్యాక్ చేయబడి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 10 ఫోన్ 6GB ర్యామ్ తో మరియు 128GB స్టోరేజ్‌తో ప్యాక్ చేయబడి లభిస్తుంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో యొక్క ఆప్టిక్స్ విభాగానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్ / 2.5 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో రెండు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. మరోవైపు ఇన్ఫినిక్స్ నోట్ 10 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు రెండు మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్‌లు కలిగి ఉంటాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 16 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాను ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ తో కలిగి ఉంటాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 10

ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మరియు ఇన్ఫినిక్స్ నోట్ 10 రెండు ఫోన్లు 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తాయి. ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుండగా ఇన్ఫినిక్స్ నోట్ 10 మాత్రం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బ్యాటరీలు 142 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు 11 గంటల గేమింగ్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది. రెండు ఫోన్‌లు టియువి రైన్‌ల్యాండ్ చేత ధృవీకరించబడ్డాయి. ఇవి ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మరియు మల్టీఫంక్షనల్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో USB టైప్-సి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటివి ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Infinix Note 10 Pro, Infinix Note 10 Smartphones Released in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X