ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ తగ్గింపు ఆఫర్లతో ప్రారంభమయ్యాయి!!

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. దీని యొక్క మొదటి సేల్స్ ఇండియాలో ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బోతో పాటుగా ఈ స్మార్ట్‌ఫోన్ మే 20న భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G88 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి లభిస్తుంది. ఇది 180Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేతో పాటుగా కంపెనీ X OS 10.6 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ నోట్ 12 ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.11,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999. ఈ హ్యాండ్‌సెట్ ఫోర్స్ బ్లాక్, జ్యువెల్ బ్లూ మరియు సన్‌సెట్ గోల్డ్ వంటి కలర్ ఆప్షన్‌లలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం యాక్సిస్ బ్యాంక్ మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారుల యొక్క లావాదేవీలపై 10 శాతం (రూ.1,000 వరకు) వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

 

వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?

 

 

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత X OS 10.6 తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G88 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.6 అపెర్చర్ లెన్స్ తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, AI లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్, FM రేడియో, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. చివరిగా ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Infinix Note 12 Smartphone First Sales Live in Flipkart India: Price, Specifications, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X