Home
News

VIP ఎడిషన్ లో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ! ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి

By Maheswara

గత నెలలో Infinix Note 30 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇప్పుడు Infinix Note 30 VIPని లైనప్‌లో ప్రకటించింది. హ్యాండ్‌సెట్ సెల్ఫీ షూటర్ కోసం సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, ఇది దాని ధర విభాగంలో మొదటిది ఇదే.

ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP ఎడిషన్, మీడియా టెక్ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 12GB RAM మరియు ఆండ్రాయిడ్ 13 OSతో అందించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలను ఇక్కడ చూడండి.

Infinix Note 30 VIP Edition With 108MP Camera, 50W Wireless Charging Launched. Price, Specifications Details

ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP ఎడిషన్ యొక్క ధర మరియు సేల్ వివరాలు
ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP ఎడిషన్ యొక్క స్మార్ట్ ఫోన్ ధర $299 (దాదాపు రూ. 24,700) గా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది మ్యాజిక్ బ్లాక్ మరియు గ్లేసియర్ వైట్ రంగులలో వస్తుంది. భారతదేశంలో దీని లభ్యత గురించి కంపెనీ ఇంకా వివరాలు ప్రకటించలేదు.

ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP ఎడిషన్ స్పెసిఫికేషన్ ల వివరాలు
ఈ ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP ఎడిషన్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1920Hz PWM డిమ్మింగ్, 900nits పీక్ బ్రైట్‌నెస్ మరియు పంచ్-హోల్ కటౌట్‌తో 6.67 అంగుళాల FHD+ 10bit అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇక ప్రాసెసర్ వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ ARM G77 MC9 GPUతో MediaTek డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB/12GB LPDDR4X RAM మరియు 256GB UFS3.1 స్టోరేజీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ XOS 13 కస్టమ్ స్కిన్ తో ఆండ్రాయిడ్ 13 OS తో పనిచేస్తుంది.

ఇక కెమెరా వివరాలు గమనిస్తే, ఈ తాజా ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP ఎడిషన్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.75 ఎపర్చర్‌తో 108MP ప్రైమరీ శాంసంగ్ HM6 సెన్సార్, 2MP మాక్రో యూనిట్ మరియు 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా అమర్చారు.

ఇక చివరగా, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలు గమనిస్తే ఇది 68W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అయితే 68W వైర్డ్ ఛార్జింగ్ ద్వారా అదే సమయంలో 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు.

ఇంకా, నెట్వర్క్ కనెక్టివిటీ ఆప్షన్ లను పరిశీలిస్తే ఇది 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.2, GPS/GLONASS, NFC మరియు USB టైప్ C పోర్టులు ఉన్నాయి. ఇంతకు ముందు ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి విడుదలైన లీక్ ల ప్రకారం Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ భారతదేశంలో కూడా లాంచ్ కానుంది.

Best Mobiles in India

English summary
Infinix Note 30 VIP Edition With 108MP Camera, 50W Wireless Charging Launched. Price, Specifications Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X