Home
News

6.78 అంగుళాల డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్‌తో ఫోన్‌.. 12న కొనుగోలుచేస్తే రూ.4999 విలువైన కిట్‌ ఉచితం!

ఇన్ఫినిక్స్‌ సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఏప్రిల్‌ 12న ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5G సిరీస్‌ (Infinix Note 40 pro 5G) ను లాంచ్‌ చేయనుంది. అయితే తాజాగా ఇన్ఫినిక్స్ సంస్థ Early Bird సేల్‌ ఆఫర్లను ప్రకటన చేసింది. ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.4000 పవర్‌ బ్యాంక్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 12న లాంచ్‌ కానుంది. అదే రోజు ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేస్తే రూ.4999 విలువైన MAGKIT ను ఉచితంగా పొందవచ్చు. అందులో రూ.3999 విలువైన 3020mAh సామర్థ్యం కలిగిన ఇన్ఫినిక్స్‌ మెగ్‌పవర్‌ పవర్‌ బ్యాంక్‌, రూ.1000 విలువైన మెగ్‌కేస్ కవర్‌ ఉంటుంది.

Infinix Note 40 pro 5G series announced Early Bird sale offers in india

ఇన్ఫినిక్స్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ భారత్‌లో విడుదల కానుంది. ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G సిరీస్ (Infinix Note 40 Pro 5G Series) ఏప్రిల్‌ 12న లాంచ్‌ కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ అనేక కొత్త ఫీచర్లతో లాంచ్ కానుందని తెలుస్తోంది. తొలిసారిగా ఈ ఫోన్ Cheetah X1 చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సంస్థ పేర్కొంది.

ఈ సిరీస్‌ 6.78 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1500Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్‌ కానుంది. ఈ డిస్‌ప్లే ద్వారా మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది. నోట్ 40 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు ప్రీమియం డిజైన్‌, ప్రీమియం వెగాన్‌ లెదర్, గ్లాస్‌ ఫినిష్‌తో లాంచ్ కానుంది. 55 డిగ్రీల గోల్డెన్‌ కర్వేచర్ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్‌ ఫోన్లు స్టైల్‌ మరియు మన్నికను అందిస్తాయి.

8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు..! :
ఈ ఇన్ఫినిక్స్‌ 40 ప్రో సిరీస్ X1 Cheetah ఛార్జింగ్‌ చిప్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ పనితీరు డ్యామేజీ కాకుండా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను అందిస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ Muti Mode ఫాస్ట్‌ ఛార్జ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మూడు ఛార్జింగ్‌ మోడ్‌లు, హైపర్‌ ఛార్జ్‌తో వస్తుంది. నోట్‌ 40 ప్రో+ ను 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు.

నోట్‌ 40 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే నోట్‌ 40 ప్రో+ 100W ఛార్జింగ్‌ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు 20W వైర్‌లెస్‌ MagCharge సపోర్టును కలిగి ఉంటాయి. దీంతోపాటు కార్నింగ్ గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటాయి. వింటేజ్‌ గ్రీన్‌ మరియు టైటాన్‌ గోల్డ్ రంగుల్లో లభిస్తాయి.

ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. 3x జూమ్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 108MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు మరో రెండు కెమెరాలుంటాయి. ఈ వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 40 pro 5G series announced Early Bird sale offers in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X