Infinix Note 7 First sale: గేమింగ్ ఫీచర్లతో అమ్మకానికి కొత్త ‌ఫోన్!! అందుబాటు ధరలోనే....  

|

ఇండియాలో లాక్ డౌన్ సమయంలో చాలా మంది వారి యొక్క స్మార్ట్‌ఫోన్లలో గేమ్ లను ఆడటం అలవాటు చేసుకున్నారు. గేమ్లను ఆడటానికి కనీసం 3GB లేదా 4GB ర్యామ్ అవసరం ఉంటుంది. 4GB ర్యామ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో గత వారం ఇన్ఫినిక్స్ సంస్థ నోట్-సిరీస్ విభాగంలో కొనసాగింపుగా విడుదల చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి మొదలుకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో గల నోట్ 7 మీడియాటెక్ G70 SoC, 6.95-అంగుళాల పెద్ద డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ క్వాడ్-కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ నోట్ 7 ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ నోట్ 7 ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ ను కేవలం ఒకే ఒక వేరియంట్లో కొనుగోలు చెయవచ్చు. 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో లభించే వేరియంట్ యొక్క ధర రూ.11,499. ఈ ఫోన్ ఈథర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ మరియు బొలీవియా బ్లూ అనే మూడు రకాల కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా దీనిని ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

Also Read:ఈ ఫోన్లపై భారీగా ధరలు తగ్గాయి! 7 వేల వరకు కూడా ధర తగ్గింపు.Also Read:ఈ ఫోన్లపై భారీగా ధరలు తగ్గాయి! 7 వేల వరకు కూడా ధర తగ్గింపు.

ఇన్ఫినిక్స్ నోట్ 7 3D గ్లాస్ ఫినిష్ డిజైన్ డిస్ప్లే  

ఇన్ఫినిక్స్ నోట్ 7 3D గ్లాస్ ఫినిష్ డిజైన్ డిస్ప్లే  

ఇన్ఫినిక్స్ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ 6.95-అంగుళాల HD + డిస్ప్లేని పంచ్-హోల్ స్క్రీన్ నిర్మాణంలో 20.5: 9 కారక నిష్పత్తితో, 91.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 450 నిట్ల స్క్రీన్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది . అలాగే ఈ ఫోన్ వెనుకవైపున 3D గ్లాస్ ఫినిష్ తో మరియు ముందు భాగంలో 2.5D గ్లాస్‌తో కట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 7 మీడియాటెక్ హెలియో G70 SoC ఫీచర్స్

ఇన్ఫినిక్స్ నోట్ 7 మీడియాటెక్ హెలియో G70 SoC ఫీచర్స్

ఇన్ఫినిక్స్ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G70 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది. ఇది ఫోన్ యొక్క పవర్ బటన్ వలె రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఛార్జ్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 7 అల్ట్రావైడ్ లెన్స్ క్వాడ్ కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ నోట్ 7 అల్ట్రావైడ్ లెన్స్ క్వాడ్ కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను మరియు ముందుభాగంలో పంచ్ హోల్‌ డిజైన్ లో ఒక కెమెరాను కలిగి ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ సెన్సార్ మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్ తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది. 

Best Mobiles in India

Read more about:
English summary
Infinix Note 7 Smartphone First Sale Starts Today in India via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X