రూ.1000ల తగ్గింపుతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 ఇండియాలో రెండవ సారి ధరను 1,000 రూపాయల వరకు తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999రూపాయలు మరియు 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999రూపాయల ధరతో విడుదల చేశారు.

ఇప్పుడు రెండవ సారి ధర తగ్గింపును పొందిన తరువాత ఇప్పుడు 2 జిబి ర్యామ్ వేరియంట్ ధర 4,499 రూపాయలు మరియు 3 జిబి వేరియంట్ ధర 5,999 రూపాయలతో అందుబాటులో ఉంది.ఈ రెండు వేరియంట్ లు బోర్డియక్స్ రెడ్, శాండ్‌స్టోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తాయి.

స్పెసిఫికేషన్స్:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 మొబైల్ ఫోన్ 5.45-అంగుళాల HD + డిస్ప్లే 720 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 18: 9 కారక నిష్పత్తిని కలిగి ఉంది. ఈ డివైస్ 1.5GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ SoC చేత శక్తిని కలిగి ఉంది.ఇవి వరుసగా 2GB / 3GB RAM మరియు 16GB / 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటాయి.ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఇన్ఫినిక్స్ XOS v3.3.0 తో రన్ అవుతుంది.ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు అయితే ఇది ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది.

కెమెరా ఫీచర్స్:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 మొబైల్ ఫోన్ వెనుక వైపు 13మెగాఫిక్సల్ సెన్సార్ f/ 2.0 ఎపర్చర్ కెమెరాతో వస్తుంది మరియు ముందువైపు 8మెగాఫిక్సల్ సెన్సార్ f/ 2.0 ఎపర్చర్ తో ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. రెండు కెమెరాల్లో డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ మరియు బోకె మోడ్ ఉన్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్ ఫోన్ 3050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ లక్షణాలలో 4G VoLTE, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 4.2, GPS+ గ్లోనాస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








