Infinix Smart 4 బడ్జెట్ ఫోన్ మొదటి సేల్ నేడే!!! అద్భుతమైన సేల్ ఆఫర్స్...
ఇండియాలో బడ్జెట్ ధరలో ఈ నెల ప్రారంభంలో విడుదల అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్నాయి. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6,000mAh బ్యాటరీ, మీడియాటెక్ హెలియో A22 SoC మరియు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిన ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఫోన్ ధరలు & సేల్ ఆఫర్స్
ఇండియాలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ లో విడుదల అయింది. 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో లభించే ఫోన్ యొక్క ధర కేవలం రూ.6,999. ఇది మిడ్నైట్ బ్లాక్, ఓషన్ వేవ్, క్వెట్జల్ సియాన్ మరియు వైలెట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. తొలిసారిగా మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వచ్చే ఈ ఫోన్ కొనుగోలు మీద ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం అనేక ఆఫర్లను అందిస్తున్నది. వీటిలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డులపై 10 శాతం ఆఫ్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుల మీద ఐదు శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్ల కింద నెలకు రూ.584 నుండి ప్రారంభమవుతాయి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఫోన్ IPS డిస్‌ప్లే ఫీచర్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల HD + ఇన్సెల్ IPS డిస్‌ప్లేను 720x1,640 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) పై మరియు XOS 6.2 డాల్ఫిన్ ఇంటర్ఫేస్ తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC ను కలిగి ఉండి 2GB RAM మరియు 32GB ఆన్బోర్డ్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరిని మరింత విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఫోన్ 6000mAh బ్యాటరీ ఫీచర్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11 a / b / g / n, బ్లూటూత్ 4.2, GPS / A-GPS, మైక్రో-యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది.


Click it and Unblock the Notifications