Home
News

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు, లాంచ్ ఆఫర్స్ ఇవే

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నేడు ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A పేరుతో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ప్రారంభించింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A అనేది ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన స్మార్ట్ 5 యొక్క ఆఫ్‌డేట్ మోడల్ గా లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో A20 SoC చేత రన్ అవుతూ గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్ పైన దాని స్వంత XOS 7.6 స్కిన్ ను కలిగి ఉంది. బడ్జెట్ విభాగంలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు లభ్యత వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A ధరలు & లాంచ్ ఆఫర్స్

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A ధరలు & లాంచ్ ఆఫర్స్

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. ఇందులో 2GB RAM/32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభించే వేరియంట్ యొక్క ధర రూ.7,999. అయితే ఇది ప్రారంభంలో రూ.6,499 పరిచయ ధరలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్రారంభ ధర విక్రయానికి మొదటి రోజు మాత్రమే చెల్లుతుంది. ఈ ఫోన్ ఆగస్టు 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తుంది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ వేవ్ మరియు క్వెట్జల్ సయాన్ వంటి మూడు కలర్ ఎంపికలలో విడుదల చేయబడింది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A లాంచ్ సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A లాంచ్ సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ సేల్ ఆఫర్‌లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ ఉంటుంది. ICICI బ్యాంక్, ఇండస్లాండ్లాండ్ బ్యాంక్, SBI కార్డు మరియు మొబిక్విక్ జారీ చేసిన AMEX కార్డుల మొదటి లావాదేవీపై 20 శాతం తగ్గింపు అదనంగా లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్ మొదటిసారి లావాదేవీపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ అమ్మకం సమయంలో గూగుల్ నెస్ట్ మినీ లేదా గూగుల్ నెస్ట్ హబ్‌ను వరుసగా కేవలం రూ.1,999 మరియు రూ.5,999 తగ్గింపు ధరల వద్ద పొందవచ్చు. ICICI మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డు యొక్క మొదటిసారి లావాదేవీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. చివరిగా మొదటి ఫ్లిప్‌కార్ట్ పే ఆఫ్టర్ ఆర్డర్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A స్పెసిఫికేషన్స్

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5A స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A స్మార్ట్ ఫోన్ 6.52-అంగుళాల హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను 1560 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో మరియు 20: 9 యాస్పెక్ట్ రేషియోని 500 నిట్స్ యొక్క క్లెయిమ్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. డిస్‌ప్లే పైన AGC AS2 గ్లాస్ ప్రొటెక్షన్ అదనంగా ఉంది. ఇది 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడిన MediaTek Helio A20 SoC ద్వారా జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

ఇన్ఫినిక్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A స్మార్ట్ ఫోన్ డిటిఎస్ సరౌండ్ సౌండ్ ఆడియోకి మద్దతు ఇస్తుంది మరియు గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌పై దాని స్వంత XOS 7.6 స్కిన్ తో పనిచేస్తుంది. భద్రత కోసం ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు పేస్ లాక్ ను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వినియోగదారులకు 35 రోజుల స్టాండ్‌బై సమయం, 19 గంటల 720p వీడియో ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్ సమయం మరియు 33 గంటల 4G టాక్ టైమ్‌ని అందించగలదని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఫోన్ వెనుకవైపున డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు పేర్కొనబడని డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. సెల్ఫీలను క్యాప్చర్ చేయడానికి ముందు భాగంలో నాచ్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Smart 5A Budget Smartphone Released in India: Price, Specs, Sale Date, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X