Infinix Smart 6 HD సేల్స్ లోని ఆఫర్‌లపై ఓ లుక్ వేయండి....

|

ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ గత వారం భారతదేశంలో బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ యొక్క ఈ బడ్జెట్ ఫోన్ యొక్క మొదటి సేల్స్ నేడు ప్రారంభం కానున్నాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 సిరీస్ విభాగంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి మెరుగైన ఫీచర్లతో వస్తుంది. ఇండియాలో ప్రారంభించిన ఒక వారం లోపే వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 2GB RAM + 32GB స్టోరేజ్ స్పేస్‌తో లభించే ఈ సింగిల్ వేరియంట్‌ యొక్క ధర రూ.6,799. ఆసక్తిగల వినియోగదారులు ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD డిస్కౌంట్ & లాంచ్ ఆఫర్లు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD డిస్కౌంట్ & లాంచ్ ఆఫర్లు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD లాంచ్‌లో భాగంగా కొనుగోలుదారులకు ఇన్ఫినిక్స్ సంస్థ అనేక ఆఫర్‌లను అందిస్తోంది. స్టార్టర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6HD స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. అలాగే కొనుగోలుదారులు రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రీడీమ్ చేసుకోగలిగే క్యాష్‌బ్యాక్ కూపన్లను కూడా పొందవచ్చు. ఇది కాకుండా ఇన్ఫినిక్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కొనుగోలుదారులు Google Nest Hub స్మార్ట్ డిస్‌ప్లేను రూ.4,999కి మరియు Google Nest Miniని రూ.1,999కి పొందవచ్చు. సాధారణంగా ఈ రెండు పరికరాలను ఇ-రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లో రూ.8,999 మరియు రూ.3,499 ధరల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్పెసిఫికేషన్స్
 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD యొక్క స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్ గా అందుబాటులోకి వచ్చిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఫోన్ 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ 90.66% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో మరియు 440 నిట్‌ బ్రైట్‌నెస్ లను కలిగి ఉంది. అదనంగా స్క్రీన్‌పై పాండా MN228 గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

మెమొరీ & ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్

మెమొరీ & ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఫోన్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మరియు మెమరీ వివరాల విషయానికి వస్తే ఇది గరిష్టంగా 2GHz వద్ద క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్‌ను కలిగి ఉండి శక్తిని పొందుతుంది. ఈ ప్రాసెసర్ IMG పవర్ VR GE8320 GPU తో వస్తుంది. ఇక ఈ ఫోన్ 2GB RAM మరియు 32GB స్టోరేజ్ స్పేస్‌తో జత చేయబడి వస్తుంది. ఇందులో 3GB వరకు వర్చువల్ RAM ని కలిగి ఉండి 512GB వరకు విస్తరించదగిన మెమరీకి మద్దతు ఇచ్చే ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ కూడా ఉంది.

ఆప్టిక్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఫోన్ యొక్క ఆప్టిక్స్ లలో కెమెరా మరియు ఇమేజింగ్ వివరాల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో f/2.0 ఎపర్చరు మరియు డెప్త్ సెన్సార్‌తో 8MP ప్రైమరీ సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ సెన్సార్లతో పాటు డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన 5MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Infinix Smart 6 HD First Sale Live on Flipkart India: Price, Specs, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X