Home
News

50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో తక్కువ ధరలో Infinix కొత్త ఫోన్! మర్చి 1 న లాంచ్

ఇన్ఫినిక్స్‌ సంస్థ నుంచి Infinix Smart 8 Plus ఈ వారంలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని Flipkart ప్రత్యేక వెబ్‌పేజీ ద్వారా ప్రకటించింది. ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ సిరీస్ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో, కొన్ని ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది.

ఈ Infinix Smart 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ 6,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో సహా ఫీచర్లను కలిగి ఉంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ హీలియో G36 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4GB RAM తో జత చేయబడింది. ఇది నోటిఫికేషన్‌లు మరియు ఇతర సమాచారాన్ని చూపించడానికి ఉపయోగించే మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

Infinix Smart 8 Plus India Launch Date Set for March 1,

ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ 8 ప్లస్ మార్చి 1న లాంచ్ చేయబడుతుందని ప్రకటించడానికి వెబ్‌పేజీని ప్రచురించింది.సంస్థ ఇంకా ఈ హ్యాండ్‌సెట్ ధరను వెల్లడించలేదు, అయితే దీని ధర రూ.7,000 లోపు ఉంటుందని వెబ్‌పేజీ నిర్ధారిస్తుంది.

ఈ జాబితా ప్రకారం, ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ 8 ప్లస్ , మీడియా టెక్ హీలియో G36 SoC ప్రాసెసర్ తో పాటు 4GB RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ తో నడుస్తుంది. ఆన్‌బోర్డ్ ర్యామ్‌ను వర్చువల్‌గా 8GB వరకు విస్తరించవచ్చు. అయితే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 2TB వరకు విస్తరించవచ్చు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ USB టైప్-సి పోర్ట్ ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ యూనిట్ ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 47 గంటల టాక్ టైమ్, 90 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయం మరియు 45 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను అందించగలదని క్లెయిమ్ చేయబడింది.

ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ 8 ప్లస్‌లో దాని మ్యాజిక్ రింగ్ కార్యాచరణను ప్యాక్ చేసింది. నోటిఫికేషన్‌లను చూపడానికి ముందు కెమెరా కటౌట్ చుట్టూ పిల్ ఆకారపు యానిమేషన్ కనిపిస్తుంది. ఇది యాపిల్ యొక్క డైనమిక్ ఐలాండ్ ఫీచర్ మాదిరిగానే పనిచేస్తుంది,ఈ హ్యాండ్‌సెట్ గురించిన మరిన్ని వివరాలు ఫిబ్రవరి 28న వెల్లడికానున్నాయి.

ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ 8 ప్లస్ ఇప్పటికే గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల IPS పూర్తి-HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చే కొత్త పరికరం పది వేల లోపు బడ్జెట్‌లో విడుదల కానుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

Best Mobiles in India

English summary
Infinix Smart 8 Plus India Launch Date Set for March 1,Comes With 6,000mAh battery, 50MP camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X