Home
News

రూ.7299 కే ..! 50MP కెమెరా,6000mAh బ్యాటరీ,అద్భుతమైన డిజైన్ కలిగిన ఫోన్ కొనండి!

ఇన్ఫినిక్స్‌ యొక్క Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ క్వాడ్ LED రింగ్ డిజైన్, 50MP ప్రధాన కెమెరా, 8GB RAM, 2TB స్టోరేజీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ మరియు HD ప్లస్ డిస్‌ప్లేతో ప్రీమియం డిజైన్ ను అందిస్తుంది. ఇది భారతీయ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఉత్సాహవంతంగా చేస్తుంది. ఈ ఫోన్ తక్షణ తగ్గింపు ఆఫర్ తో లభిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మ్యాజిక్ రింగ్ బెజెల్‌తో కూడిన ఫ్లూయిడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, ఆక్టా-కోర్ చిప్‌సెట్ మరియు వర్చువల్ ర్యామ్ ఇతర ఫీచర్లు బడ్జెట్ ప్రియులను గిలిగింతలు పెట్టేలా చేస్తాయి. అందువల్ల, బడ్జెట్‌ ధర లో అద్భుతమైన డిజైన్ తో కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

Infinix Smart 8 Plus Is Now Available With Huge Discount Of 22Percent In Flipkart Sale Priced At Rs 7299

Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్‌ల వివరాలు: ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్ 6.6 అంగుళాల (1612 x 720 పిక్సెల్‌లు) HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

అలాగే, ఈ డిస్ప్లేలో 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB RAM మరియు 128GB స్టోరేజీ తో వస్తుంది. అలాగే, ఇది 4GB వర్చువల్ RAM, 2TB మైక్రో SD కార్డ్ స్లాట్ మరియు డ్యూయల్ నానో సిమ్ స్లాట్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ XOS 13 మరియు ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ OSతో ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో G36 12nm ప్రాసెసర్ తో వస్తుంది. అందువల్ల ఈ ఫోన్ లో మీరు మీడియం గేమింగ్ పనితీరును ఆశించవచ్చు.

అదేవిధంగా IMG PowerVR GE8320 GPU గ్రాఫిక్స్ కార్డ్ వస్తుంది. ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా + AI లెన్స్‌తో క్వాడ్ LED రింగ్ ఫ్లాష్ సపోర్ట్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

ఇది 8MP సెల్ఫీ షూటర్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ ఫేస్ ఫాస్ట్ అన్‌లాక్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది తగినంత బ్యాకప్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఇది 4G మోడల్ కాబట్టి, ఇది 4G VoLTE సపోర్ట్‌తో కూడా వస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ యొక్క 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.7,799 గా ఉంది. ఇప్పుడు సేల్ లో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో రూ.500 తగ్గింపు లభిస్తుంది.కాబట్టి, మీరు దీన్ని రూ.7,299 బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గెలాక్సీ వైట్, సినీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Infinix Smart 8 Plus Is Now Available With Huge Discount Of 22Percent In Flipkart Sale Priced At Rs.7299
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X