రూ.5,999 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Infinix Smart HD 2021 మొదటి సేల్ ప్రారంభం!! ఆఫర్స్ అమొగం..
ఇండియాలో సాధారణంగా బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే చైనా బ్రాండ్ షియోమి మరియు రియల్ మి లకు పోటీగా ఇన్ఫినిక్స్ సంస్థ కూడా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నది. ఇటీవల కూడా ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదలు అయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా మీకు నచ్చిన వారికి క్రిస్మస్ బహుమతిగా దీనిని బహుకరించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 ధర & సేల్ ఆఫర్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆన్‌లైన్ అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్‌లైన్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ మొదలయ్యాయి. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల అయ్యే ఈ ఫోన్ యొక్క ధర రూ.5,999. ఇది ఇది అబ్సిడియన్ బ్లాక్, క్వార్ట్జ్ గ్రీన్ మరియు టోపాజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు మీద లభించే ఆఫర్ల విషయానికొస్తే ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డులపై 10% తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, బాబ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు యొక్క మొదటి లావాదేవీపై రూ.100 అదనపు డిస్కౌంట్ మరియు ప్రతి కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డు యొక్క రూ.1000 లావాదేవీపై రూ.2000 విలువచేసే ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, మరియు ఖర్చులేని EMI ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డి 2021 స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల హెచ్‌డి + వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 12nm హెలియో A20 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 2GB RAM మరియు 32GB స్టోరేజ్ మెమొరీతో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని 256GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ తో 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది అనేక AI సీన్ డిటెక్షన్ మోడ్లు, HD వీడియో రికార్డింగ్, AI HDR మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, AI బ్యూటీ మోడ్ మరియు పనోరమా మోడ్ ల మద్దతుతో వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ తో జతచేయబడి వస్తుంది. ఫ్రంట్ కెమెరా AI HDR మోడ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్ల మద్దతుతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 5,000mAh బ్యాటరీ ఫీచర్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్మార్ట్‌ఫోన్ 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 34 రోజుల పాటు స్టాండ్బై సమయాన్ని 1.5 రోజుల నాన్-స్టాప్ 4G టాక్-టైమ్, హెడ్సెట్ ద్వారా 5 రోజుల నాన్-స్టాప్ మ్యూజిక్, 12 గంటల వెబ్ సర్ఫింగ్ మరియు 14 గంటల గేమింగ్ మద్దతు ఇస్తుందని సంస్థ పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత XOS 6.2 రన్ అవుతుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మరియు VoWiFi / డ్యూయల్ VoLTE లకు మద్దతును కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








