బడ్జెట్ ధరలో విడుదలైన Infinix స్మార్ట్ డివైస్లు ఇవే!!! ఫీచర్స్ అదుర్స్...
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో సింగిల్ ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యింది. ఇది డిసెంబర్ 24 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేక అమ్మకాలలో లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్స్ వివరాలు గతంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని ప్రత్యేక పేజీలో విడుదల అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇన్ఫినిక్స్ సంస్థ నాలుగు 2.5-అంగుళాల ఆల్-ఫ్రీక్వెన్సీ స్పీకర్లతో స్నోకర్ A10 సౌండ్‌బార్‌ను కూడా విడుదల చేసింది. ఈ సౌండ్‌బార్ డిసెంబర్ 18 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డి 2021 స్మార్ట్‌ఫోన్ 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఒకే ఒక మోడల్‌లో టోపాజ్ బ్లూ, క్వార్ట్జ్ గ్రీన్ మరియు అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల అయింది. ఈ మోడల్ యొక్క ధర 5,999 రూపాయలు. దీనిని డిసెంబర్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ చేత రన్ అవుతుంది. ఇది 6.1-అంగుళాల HD + డ్రాప్-నాచ్ డిస్ప్లేను 500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో మరియు 720x1,560 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది హుడ్ కింద మీడియాటెక్ హెలియో A20 SoC తో ప్యాక్ చేయబడి 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు. వెనుకవైపున ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కూడా అదనంగా కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ ఫీచర్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ తో జతచేయబడి వస్తుంది. ఇది ఆటో సీన్ డిటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్నందున ఇది తొమ్మిది రకాల బహిరంగ దృశ్యాలను సులభంగా గుర్తించగలదు. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ స్నాపర్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది హైబ్రిడ్ ట్రేను కలిగి ఉండి వినియోగదారులను రెండు నానో సిమ్ కార్డులు మరియు మైక్రో ఎస్‌డి కార్డులను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 28 గంటల వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది అని సంస్థ పేర్కొంది. ఇది DTS-HD సరౌండ్ సౌండ్ ఫీచర్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ స్నోకర్ A10 సౌండ్‌బార్ ధర & ఫీచర్స్
ఇన్ఫినిక్స్ సంస్థ తన మొట్టమొదటి సౌండ్‌బార్ స్నోకర్ A10 ను విడుదల చేసింది. ఇది నాలుగు 2.5-అంగుళాల ఆల్-ఫ్రీక్వెన్సీ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇది మొత్తంగా 60W ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. ఇది పైభాగంలో మెటల్ మెష్ కవర్ కలిగి ఉండి HDMI (ARC), USB, కోక్సియల్, AUX మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఎంపికలతో ఉంటుంది. 2.5 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే కలిగిన స్నోకర్ A10 సౌండ్‌బార్ యొక్క ధర రూ.4,499. డిసెంబర్ 18 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








