ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!

By Maheswara
|

ఇన్ఫినిక్స్ సంస్థ భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ జీరో బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ సిరీస్ లో రెండు మోడళ్లను కలిగి ఉంది. అవి, ఇన్ఫినిక్స్ జీరో బుక్ మరియు ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా పేర్లతో పరిచయమయ్యాయి. ఈ ల్యాప్‌టాప్‌లు కలర్-రిచ్ 15.6-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేలతో వస్తాయి మరియు మూడు ప్రాసెసర్ వేరియంట్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ 96EU ఐరిస్ గ్రాఫిక్స్‌ వస్తుంది మరియు ఈ ల్యాప్‌టాప్ యొక్క హై-ఎండ్ వేరియంట్ 12వ Gen ఇంటెల్ కోర్ i9 CPU ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ యొక్క పరికరాలన్నీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

 
Infinix Zero Book Series Launched In India. Price And Specifications Details In Telugu

ఇన్ఫినిక్స్ జీరో బుక్ మరియు ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ధర, సేల్ వివరాలు

 

ఇన్ఫినిక్స్ జీరో బుక్ రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఇన్ఫినిక్స్ జీరో బేస్ మోడల్‌లో 12వ జెన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 16GB RAM మరియు 512GB SSD తో వస్తుంది. ఈ మోడల్ రూ. 49,990 గా ఉంది. ఇదే మోడల్ యొక్క 12వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో వచ్చే వేరియంట్ ధర రూ. 64,990 గా ఉంది.

Infinix Zero Book Series Launched In India. Price And Specifications Details In Telugu

అలాగే, 12వ జెన్ ఇంటెల్ కోర్ i9 చిప్‌సెట్, 32GB RAM మరియు 1TB SSDతో కూడిన ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ధర రూ. 84,990, అదే హై-ఎండ్ మోడల్ 512GB SSD స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,990 గా ఉంది. ఇన్ఫినిక్స్ జీరో యొక్క అన్ని మోడళ్ళు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ జీరో బుక్, ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఇన్ఫినిక్స్ జీరో బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు 16.9mm మందం తో 1.8kg బరువుతో సన్నని తేలికపాటి మెటల్ బాడీని కలిగి ఉంటాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌ల యొక్క డిస్ప్లే లు 100% sRGB రంగు పునరుత్పత్తిని అందిస్తాయి. మరియు 400 nits బ్రైట్‌నెస్‌తో 15.6-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ముందుగానే చెప్పినట్లుగా, ఈ ల్యాప్‌టాప్‌లు తాజా 12వ జెన్ ఇంటెల్ కోర్ H i5, i7 మరియు i9 చిప్‌సెట్‌లతో మూడు ప్రాసెసర్ వేరియంట్‌లను కలిగి ఉన్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ 96EU ఐరిస్ గ్రాఫిక్‌లను కలిగి ఉన్నాయి.

Infinix Zero Book Series Launched In India. Price And Specifications Details In Telugu

ఇంకా, ఈ ల్యాప్‌టాప్‌ లు జీరో బుక్ ఓవర్ బూస్ట్ స్విచ్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇది ఈ పరికరాన్ని "మూడు వేర్వేరు మోడ్‌ల మధ్య మార్చడానికి సులభంగా పనిచేస్తుంది. ఈ మోడ్ లలో ఎకో మోడ్ (బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి), బ్యాలెన్స్ మోడ్ (ఓవర్ బూస్ట్ మరియు ఎకో మోడ్ మధ్య స్థిరత్వాన్ని కొనసాగించడానికి) మరియు ఓవర్ బూస్ట్ మోడ్ (భారీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు 54W అవుట్‌పుట్ పవర్‌లో అధిక పనితీరును అందించడానికి) పనిచేస్తాయి.

ఛార్జింగ్ మరియు పోర్ట్ ల వివరాలు

ఈ ల్యాప్‌టాప్‌లలో ఇన్ఫినిక్స్ 96W పోర్టబుల్ హైపర్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్‌ను కలిగి ఉంది, ఇది దాదాపు రెండు గంటల్లో ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఇన్ఫినిక్స్ జీరో బుక్ ల్యాప్‌టాప్‌లు AI బ్యూటీ క్యామ్, AI నాయిస్ రిడక్షన్, ఫేస్ ట్రాకింగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఫీచర్‌తో ఫ్రంట్ ఫేసింగ్ వెబ్‌క్యామ్‌ను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా, ఈ జీరో బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో రెండు USB టైప్-A 3.0 పోర్ట్‌లు, ఛార్జింగ్ మరియు డేటా బదిలీ కోసం ఒక USB టైప్-C పోర్ట్, ఒక HDMI 1.4 పోర్ట్ మరియు డేటా బదిలీ కోసం మరొక టైప్-C పోర్ట్ ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లలో SD కార్డ్ స్లాట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. Wi-Fi 6E, ICE Strom 2.0 డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ మరియు క్వాడ్-అరే స్పీకర్ సెటప్‌తో వస్తాయి.

Best Mobiles in India

English summary
Infinix Zero Book Series Launched In India. Price And Specifications Details In Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X